భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ విపరీతంగా పెరిగింది. కరోనా మహమ్మారి తర్వాత స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు ఉండే పరిస్థితి ఉంది. దీంతో కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఈ నెల ప్రారంభంలో నార్జో ఎన్55ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ వారం ప్రారంభంలో ఈ ఫోన్‌ను కంపెనీ మొదటిసారిగా అమ్మకానికి తీసుకువచ్చింది. ఈ ఏడాదికి అమెజాన్‌లో రూ. 10,000-రూ. 15,000 ధరల విభాగంలో విక్రయం ప్రారంభమైన మొదటి రోజున అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ నార్జో ఎన్55 నిలిచిందని రియల్ మీ ప్రకటించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో నార్జో ఎన్55 మొదటి సేల్ సమయంలో 250 శాతం అమ్మకాలు పెరిగాయని పేర్కొంది. అయితే కంపెనీ ఎన్ని ఫోన్లను డిస్పాచ్ చేసిందో మాత్రం వెల్లడించలేదు. ఈ ఫోన్ ఛార్జింగ్ స్థితి, లో బ్యాటరీ హెచ్చరిక, డేటా వినియోగం, అలాగే స్టెప్స్, రోజుకు నడిచే దూరం వంటి ముఖ్యమైన సమాచారాన్ని అందించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఫీచర్ ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ రియల్‌మీ నార్జో ఎన్ 55 ఫోన్ ప్రైమ్ బ్లాక్, ప్రైమ్ బ్లూ రంగు అందుబాటులో ఉంటుంది. అలాగే 4 జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. అలాగే 6 జీబీ+128 జీబీ ధర రూ.12,999గా ఉంటుంది. ఈ ఫోన్ రియల్ మీ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేస్తే రూ.1000 తగ్గింపు లభిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..