Radiation:సెల్‌ఫోన్‌లు, టవర్ల నుంచి వెలువడే రేడియేషన్ ప్రాణాలకు ప్రమాదమని వినిపిస్తున్న పదం అందరికి తెలిసిందే. ముఖ్యంగా సెల్‌టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ప్రాణానికే ప్రమాదమని ఈ మధ్య కాలంలో చాలా కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రతి ఒక్కరు కూడా సెల్ టవర్లతో ప్రమాదం ఉంటుందని బలంగా నమ్ముతూ వచ్చారు. అయితే ఆ రేడియేషన్ వల్ల ఎలాంటి హానీ జరగదని తాజా పరిశోధనలలో తేలింది. సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ హానీ కలిగిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆప్ టెలీకమ్యూనికేషన్ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ హర్వేష్ భాటియా చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విద్యదయాస్కాంతక్షేత్ర సంకేతాలపై జరిపిన పరిశోధనల్లో మొబైల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ ఎటువంటి హానికరమైన ఆరోగ్య సమస్యలను కలిగించదని తేలిందని భాటియా పేర్కొన్నారు.
మొబైల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ గురించి వస్తున్న అపోహలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం నిర్వహించిన వెబినార్లో భాటియా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వెబినార్లో పాల్గొన్న భాటియా చేసిన వ్యాఖ్యలను ఆమోదించారు. టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఎలాంటి హాని లేకపోవడంతో, అంతరాయం లేకుండా సిగ్నళ్లను అందించడానికి మరిన్ని టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని భాటియా అన్నారు.