Chandrayaan-3: జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టే క్షణాల కోసం ఎదురు చూపు.. సక్సెస్ కావాలని పూజలు
చంద్రయాన్ మిషన్ విజయవంతం కావాలని హోమం నిర్వహించారు. అటు.. వారణాసిలోనూ చంద్రయాన్-3 సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాగంలో సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విక్రం ల్యాండర్ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ కావాలని లక్నోలోని మసీదులో ముస్లింలు కూడా నమాజ్ చేశారు. మొత్తంగా.. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావాలని.. అంతరిక్ష ..
జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టే చారిత్రక క్షణాల కోసం యావత్ ప్రపంచం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావాలని దేశమంతా సర్వమత ప్రార్ధనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సాధువులు యాగం చేపట్టారు. చంద్రయాన్ మిషన్ విజయవంతం కావాలని హోమం నిర్వహించారు. అటు.. వారణాసిలోనూ చంద్రయాన్-3 సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ యాగంలో సాధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విక్రం ల్యాండర్ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ కావాలని లక్నోలోని మసీదులో ముస్లింలు కూడా నమాజ్ చేశారు. మొత్తంగా.. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావాలని.. అంతరిక్ష రంగంలో భారత్ చరిత్ర సృష్టించాలని కోరుకుందాం..
కాగా, బుధవారం సాయంత్రం 5.45 గంటల తర్వాత చంద్రునిపై సురక్షితమైన ల్యాండింగ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.
అయితే విద్యాసంస్థల్లో విద్యార్థులు చంద్రయాన్ 3 ల్యాండింగ్ దృశ్యాలను తిలకించే విధంగా చర్యలు చేపడుతున్నాయి విద్యాసంస్థలు. ఇవే కాకుండా పలు ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీన్ లను సైతం ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఈ చంద్రయాన్ ల్యాండింగ్ దృశ్యాలను తిలకించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం నగరంలో పలుచోట్ల సౌకర్యాలు కల్పించారు. కొన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ సంస్థలలో స్క్రీనింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు.
ఇస్రో ప్రకారం.. చంద్రయాన్-3 సాయంత్రం 4:00 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ల్యాండింగ్ మాడ్యూల్‌లోని అన్ని సిస్టమ్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో చంద్రయాన్ 2లో తలెత్తిన లోపాలు మరోసారి పునరావృతం కాకుండా ఇస్త్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చంద్రయాన్ 3లో అత్యాధునిక టెక్నాలజీని వాడినట్లు వారు తెలిపారు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ కు సంబంధించిన చర్యలు ఎప్పటికప్పుడు చేపడుతున్నామని, సాఫ్ట్ లైండింగ్ సైతం పరిశీలించామని అంటున్నారు. అయితే ఉపరితలంపై ఒక వేళ సాఫ్ట్ లో సమస్య తలెత్తితే తనంతట తానే వెతుక్కునేలా ప్లాన్ చేసుకుంటుందని ఇస్త్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
Chandrayaan-3 Mission:
🇮🇳Chandrayaan-3 is set to land on the moon 🌖on August 23, 2023, around 18:04 Hrs. IST.
Thanks for the wishes and positivity!
Let’s continue experiencing the journey together as the action unfolds LIVE at: ISRO Website https://t.co/osrHMk7MZL YouTube… pic.twitter.com/zyu1sdVpoE
— ISRO (@isro) August 20, 2023
ఇస్త్రో శాస్త్రవేత్తలు నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి జూలై 14వ తేదీన చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టారు. దాదాపు 40 రోజుల తర్వాత ఈరోజు ఈ ప్రచారం చివరి దశకు చేరుకుంది.