కీబోర్డ్‌పై QWERTY లేఅవుట్ వెనుక ఇంత కథ ఉందా?
07 July 2025
Prudvi Battula
మీరు టైప్ చేస్తున్నప్పుడు శ్రద్ధ వహిస్తే, కీబోర్డ్‌లో అక్షరాలు సరిగ్గా అమర్చబడలేదని మీకు తెలుస్తుంది.
కీబోర్డ్‌ని చూసినప్పుడు, ఇది ఎందుకు జరుగుతుందో, దీని వెనుక ఉన్న కారణం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ఇప్పటికి 155 ఏళ్లకు ముందు 1870లో లాథమ్ షోల్స్ అనే వ్యక్తి ప్రపంచంలోనే మొట్టమొదటి టైప్‌రైటర్‌ను కనుగొన్నారు.
ప్రారంభంలో, టైప్‌రైటర్ బటన్లు ఒకదానికొకటి దగ్గరగా ఉండేవి. ABC ఫార్మాట్‌లో ఉండేవి. ఇది ప్రజలు త్వరగా టైప్ చేయడానికి సహాయపడింది.
ABC ఫార్మాట్‌లో ఉన్నందున టైప్‌రైటర్ పిన్నులు చిక్కుకుపోతాయి. ఈ చిక్కు కారణంగా కీప్యాడ్ ఎక్కువగా జామ్ అయ్యేది.
ఈ జామ్ సమస్యను అధిగమించడానికి, 1873లో షోల్స్ టైప్‌రైటర్ కీప్యాడ్ ఆకృతిని మార్చాలని నిర్ణయించుకున్నాడు.
కీబోర్డ్‌పై కీప్యాడ్‌ను QWERTY ఫార్మాట్‌కి మార్చారు. ఇది ప్రజల టైపింగ్ చేసే వేగాన్ని చాలా తగ్గించింది.
ఫార్మాట్ మారిన తర్వాత, ప్రజలు టైప్ చేసేటప్పుడు, టైప్‌రైటర్ పిన్‌లు ఒకదానికొకటి చిక్కుకోకుండా సలువుగా ఉండేది.
మరిన్ని వెబ్ స్టోరీస్
విమానంలో ఏ సీటు సురక్షితమైనదో మీకు తెలుసా?
అంతరిక్షంలో అత్యధిక సాటిలైట్లను కలిగిన దేశాలు ఇవే..
పురాణాల ప్రకారం.. అష్టదిక్పాలకులు ఎవరు.?