
భారతదేశంలో 5G యుగం ప్రారంభమైన తర్వాత 5G మద్దతు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ల సంఖ్య పెరుగుతోంది. విశేషమేమిటంటే.. కొన్ని 5జీ స్మార్ట్ ఫోన్లు అతి తక్కువ ధరకే విడుదలవుతున్నాయి. అదే వరుసలో పోకో కంపెనీ కూడా చేరింది. POCO నేడు దేశంలో కొత్త పోకోM6 ప్రో 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పుడు మార్కెట్లో తక్కువ ధరల్లో ఉన్న ఫోన్‌లలో ఇదొకటి. అయితే తక్కువ ధర ఉన్నప్పటికీ, ఇది ఆకర్షణీయమైన ఫీచర్స్ ఉన్నాయి. కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ ఎంపికను అందిస్తుంది. Poco M6 Pro 5G ఫోన్ ధర, ఫీచర్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Poco M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దాని 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం 10,999. ఉంది అదేవిధంగా, దీని 6GB RAM, 128GB వేరియంట్ ధర రూ.12,999. ఉంది Poco M6 Pro 5G ఫోన్ ఆగస్ట్ 9 మధ్యాహ్నం 12 గంటలకు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించబడుతుంది. పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది.
డిస్‌ప్లే: Poco M6 Pro 5G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.79-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కూడా ఉంది.
ప్రాసెసర్: ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 4 Gen 2 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
ర్యామ్ – స్టోరేజ్: Poco M6 Pro 5G మొత్తం రెండు వేరియంట్‌లను కలిగి ఉంది. ఇది 4GB + 64GB, 6GB + 128GB సామర్థ్యంతో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 1TB వరకు నిల్వ విస్తరణ కోసం మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ కూడా ఉంది.
కెమెరాలు: Poco M6 Pro 5G ఫోన్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, LED ఫ్లాష్‌తో వెనుకవైపు 2MP అల్ట్రా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ 8MP కెమెరా ఆప్షన్ ఇవ్వబడింది.
బ్యాటరీ, ఛార్జింగ్: ఇక మొబైల్ బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీని అందించింది కంపెనీ.
సాఫ్ట్‌వేర్: ఇది ఆండ్రాయిడ్ 13 అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఆధారంగా MIUI 14ని రన్ చేస్తుంది. Android, మూడు సంవత్సరాల భద్రతా ఫీచర్స్ కలిగి ఉన్నాయి. నీరు, ధూళి నిరోధకత కోసం స్మార్ట్‌ఫోన్ IP53 రేటింగ్‌తో వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి