Poco M3 Pro 5G launch: భారత మార్కెట్లో ఇటీవల విడుదల చేసిన ఎం3 స్మార్ట్‌ఫోన్ తరువాత చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ పోకో.. ఎం3 ప్రో 5జి మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మొబైల్ లాంచింగ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించింది. జూన్ 8వ తేదీన భారతదేశంలో పోకో ఎం3 ప్రో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు పోకో వెల్లడించింది.
దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్‌లో ప్రకటించింది పోకో. ‘‘పోకో ఎం3 ప్రో వచ్చేస్తోంది. అద్భుతమైన లుక్స్‌తో 5జీ స్పీడ్ కలిగిన తొలి ఫోన్ ఎం3 ప్రో జూన్ 8వ తేదీ నుంచి ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.’’ అని పేర్కొంది.
ఇదిలాఉంటే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల చైనా, యూరోపియన్ మార్కెట్లలో విడుదల చేశారు. పోకో ఎం3 ప్రో 5జి పవర్ బ్లాక్, పోకో యెల్లో, కూల్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ మొబైల్ ధర యూరప్‌లో 179 యూరోలు ఉంది. అంటే భారత కరెన్సీలో (రూ.16,000), 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 199 యూరోలు (సుమారు రూ .17,790). లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా 4GB / 64GB వేరియంట్ ధర 159 యూరోలుగా నిర్ణయించగా.. 6GB / 128GB మోడల్ ధర 179 యూరోలకు విక్రయిస్తున్నారు.
ఫోకో ఎం3 ప్రో 5జీ ఫీచర్లు..
ఈ కొత్త పోకో స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డి + డాట్‌డిస్ప్లే స్క్రీన్‌తో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కు తోడ్పడుతుంది. రిఫ్రెష్ రేటు 30Hz నుంచి 90Hz ఛేంజ్ చేస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 4 జిబి / 64 జిబి, 6 జిబి / 128 జిబి.
ఈ స్మార్ట్‌కు ముందు, వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రేర్ కెమెరాలో 48MP మెయిన్ స్నాపర్, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్, నైట్ మోడ్, AI కెమెరా 5.0, పోర్ట్రెయిట్ మోడ్, AI బ్యూటీ మోడ్, స్లో-మోషన్ వీడియో, మరిన్ని కెమెరా ఫీచర్లు ఉన్నాయి. 18W ఫాస్ట్ ఛార్జింగ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు బ్యాటరీ వస్తుందని ఫోకో కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 11 సాఫ్ట్‌వేర్ కలిగిఉంది. ఇంకా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్, NFC, Wi-Fi, బ్లూటూత్ వెర్షన్ 5.1, GPS, 3.5mm ఆడియో జాక్, హాయ్-రెస్ ఆడియో, IR బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంది.
Also read: