Philips Holi Sale: మ్యూజిక్ ప్రియులకు ఫిలిప్స్ బంపర్ ఆఫర్.. హోలీ సేల్ పేరుతో సూపర్ డీల్..

|

Mar 20, 2024 | 7:53 AM

మీరు కూడా ఫిలిప్స్ బ్రాండ్ ఆడియో డివైజ్ లను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే.. మీకు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఫిలిప్స్ తన ఆడియో డివైజ్ లపై అదిరే డీల్స్ అండ్ డిస్కౌంట్లను అందిస్తోంది. రంగుల సంబరం హోలీ సందర్భంగా ‘ఫ్రీ మైక్ ఆఫర్’ పేరుతో ఈ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్.. మార్చి 25 వరకూ కొనసాగనున్నాయి.

Philips Holi Sale: మ్యూజిక్ ప్రియులకు ఫిలిప్స్ బంపర్ ఆఫర్.. హోలీ సేల్ పేరుతో సూపర్ డీల్..
Philips Holi Sale
Follow us on

ఆడియో ఉత్పత్తుల్లో ఫిలిప్స్ బ్రాండ్ కు మంచి పేరు ఉంది. క్వాలిటీ అవుట్ పుట్ ను ఇవ్వడంతో పాటు ఎక్కువ కాలం మన్నికను అందిస్తాయి. ఎక్కువ శాతం మంది ఈ బ్రాండ్ ను ప్రిఫర్ చేస్తుంటారు. మీరు కూడా ఫిలిప్స్ బ్రాండ్ ఆడియో డివైజ్ లను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే.. మీకు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఫిలిప్స్ తన ఆడియో డివైజ్ లపై అదిరే డీల్స్ అండ్ డిస్కౌంట్లను అందిస్తోంది. రంగుల సంబరం హోలీ సందర్భంగా ‘ఫ్రీ మైక్ ఆఫర్’ పేరుతో ఈ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్.. మార్చి 25 వరకూ కొనసాగనున్నాయి. ఈ సేల్లోని డీల్స్ గురించి తెలుసుకుందాం..

ఫిలిప్స్ హోలీ సేల్..

రంగుల సంబరం హోలీని అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. చిన్నా పెద్ద తేడా లేకుండా.. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ, అందరూ కేరింతలు కొడుతూ రంగులు చల్లుకుంటూ పండుగను జరుపుకుంటారు. అలాంటి ఆనంద సందర్భంలో మంచి సౌండ్ సిస్టమ్ కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. అలాంటి పార్టీ కోసం ఫిలిప్స్ అద్భుతమైన పార్టీ స్పీకర్ ను అందిస్తోంది. ‘ఫ్రీ మైక్ ఆఫర్’ ద్వారా అందివ్వడమే కాకుండా ప్రత్యేకమైన ప్రమోషన్ ఆఫర్ కింద వైర్డ్ మైక్రోఫోన్ కూడా ఉచితంగా ఇస్తున్నారు.

ఎక్కడైనా కొనుగోలు చేయొచ్చు..

ఈ ఉత్పత్తిని ఎక్కడైన వినియోగదారులు కొనుగోలు చేయొచ్చు. ఎక్కడ కొనుగోలు చేసినా.. ఈ ప్రమోషన్ ఆఫర్ వర్తిస్తుంది. అది ఆన్ లైన్ అయినా లేదా ఆఫ్ లైన్ స్టోర్ అయినా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్ వంటి ప్లాట్ ఫారంలో కూడా ఈ ఆఫర్ ను అవైల్ చేసుకోవచ్చు. ఫిలిప్స్ టీఏఎక్స్5708, టీఏఎక్స్5206 లేదా టీఏఎక్స్3206 వంటి పార్టీ స్పీకర్‌ల పై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్రక్రియ సులభం..

  • మీరు పార్టీ స్పీకర్ కొనుగోలు చేసిన 14 రోజులలోపు కాంప్లిమెంటరీ మైక్రోఫోన్‌ని అందుకుంటారు. అందుకోసం మీరు చేయాల్సిందేమిటంటే..
  • కొనుగోలు ఇన్‌వాయిస్ కాపీని ఉత్పత్తి క్రమ సంఖ్యతో పాటు philipsmarketing@tpv-tech.com కు ఈమెయిల్ చేయండి. లేదా 9560119945కు వాట్సాప్ ద్వారా పంపండి.
  • ఉచిత మైక్రోఫోన్ కొరియర్ డెలివరీ కోసం పూర్తి చిరునామా వివరాలను అందించండి.
  • తదుపరి విచారణల కోసం, కస్టమర్‌లు 1800 425 6396లోసంప్రదించవచ్చు.
  • ఎగువ ఆఫర్‌తో పాటు, కస్టమర్‌లు 0 డౌన్‌పేమెంట్, ఎంపిక చేసిన మోడల్‌లలో ఆఫ్‌లైన్‌లో 1 ఈఎంఐ ఉచితం, అలాగే అమెజాన్లో ఎంపిక చేసిన మోడల్‌లకు క్రెడిట్ కార్డ్, ఈఎంఐ వంటి ఆకర్షణీయమైన కన్స్యూమర్ ఫైనాన్స్ ఆప్షన్‌లను పొందవచ్చు.

ఆఖరు తేదీ..

ఈ ఆఫర్ మార్చి 15, 2024 నుంచి మార్చి 25, 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది. భారతదేశం అంతటా ఉన్న అన్ని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ఈ ఉత్తేజకరమైన ప్రమోషన్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..