Oppo reno 8: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఒప్పో రెనో 8పేరుతో లాంచ్ చేస్తున్న ఈ ఫోన్‌లో తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చారు. త్వరలోనే సేల్ ప్రారంభంకానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్‌లను సంస్థ ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు మీకోసం..
ఒప్పో రెనో 8 స్మార్ట్ ఫోన్‌లో 6.43 ఇంచెస్ ఫూల్ హెచ్‌డీ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఈ ఫోన్ స్క్రీన్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 80 వాట్స్ సూపర్ ఫ్లాష్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందంచారు. ఈ ష్లాష్ చార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 11 నిమిషాల్లోనే 50 శాతం చార్జ్ అవుతుంది.
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 8జీబీ ర్యామ్+128 స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 29,999గా ఉంది. అయితే పలు బ్యాంక్‌లు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..