
ఇటీవల కాలంలో స్మార్ట్ యాక్ససరీస్ వినియోగం పెరగడతో ప్రపంచవ్యాప్తంగా టాప్ కంపెనీలన్నీ సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ యాక్ససరీస్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లకుు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండడంతో టాప్ కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన వన్ ప్లస్ తన రెండవ తరం వాచ్‌ను బార్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2024లో ఆవిష్కరించింది. వన్‌ప్లస్ వాచ్ 2 అధునాతన అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. వన్‌ప్లస్ వాచ్ 2021లో భారతదేశంలో ప్రారంభించారు. అత్యధిక బ్యాటరీ లైఫ్‌తో పాటు మెరుగైన డిజైన్, ఫీచర్లు, గూగుల్‌కు సంబంధించిన తాజా వేర్ ఓఎస్ 4లో ఈ వాచ్ రన్ అవుతుంది. వన్‌ప్లస్ 12 సిరీస్ డిజైన్ నుంచి ప్రేరణ పొందిన తాజా వన్ ప్లస్ వాచ్ 2 2.5 డీ బ్లూ డైమండ్ క్రిస్టల్ కవర్‌తో వస్తుంది. అయితే ఈ వాచ్‌కు సంబంధించిన ఛాసిస్ యూఎస్ సైనిక ప్రమాణం ఎంఐఎల్-ఎస్టీడీ-810 హెచ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. తాజా స్మార్ట్‌వాచ్ ఐపీ 68 ద్వారా రావడంతో నీరు, ధూళి నిరోధకతను కలిగి ఉంది. అలాగే ఈ వాచ్ స్ట్రిప్ లేకుండా 49 గ్రాములు, స్ట్రిప్‌తో దాదాపు 80 గ్రాములు ఉంటుంది. ఈ నేపథ్యంలో వన్ ప్లస్ వాచ్ 2 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
వన్‌ప్లస్ వాచ్ 2 466 x 466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.43 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ వాచ్ 600 నిట్‌ల బ్రైట్ నెస్‌తో వస్తుంది. తాజా స్మార్ట్‌వాచ్ బీఈఎస్ 2700 ఎంసీయూ ఎఫిషియెన్సీ చిప్‌సెట్‌తో పాటు స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5 ఎస్ఓసీ ఆధారంగా నడుస్తుంది. వన్‌ప్లస్ ప్రకారం స్నాప్ డ్రాగన్ చిప్‌సెట్ గూగుల్ యాప్‌లను నిర్వహించడం వంటి శక్తివంతమైన పనుల కోసం ఉపయోగించవచ్చు. అయితే సమర్థత చిప్‌సెట్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ, సింపుల్ టాస్క్‌ల కోసం ఈ వాచ్ అందరినీ ఆకర్షిస్తుంది. వన్ ప్లస్ వాచ్ 2 గూగుల్‌కు సంబంధించిన వేర్ ఓఎస్ 4పై నడుస్తుంది. అలాగే 2 జీబీ + 32 జీబీ వేరియంట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ వాచ్ 2 500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అందువల్ల ఈ వాచ్ ‘స్మార్ట్ మోడ్’లో 100 గంటల బ్యాటరీ జీవితాన్ని, ‘భారీ వినియోగం’లో 48 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. 7.5 వాట్స్ వీఓఓసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి వాచ్ 2ని 60 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని వన్‌ప్లస్ ప్రతినిధులు చెబుతున్నారు.
వన్‌ప్లస్ వాచ్ 2 భారతదేశంలో రూ.24,999 ధరతో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్, క్రోమా, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లతో సహా అన్ని ప్రధాన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో 4 మార్చి 2024 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఓపెన్ సేల్ ద్వారా అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ ఐసీఐసీఐ బ్యాంక్ వన్‌కార్డ్‌తో చెల్లింపు చేస్తున్నప్పుడు ఈ వాచ్ 2 కొనుగోలుపై రూ.2,000 తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది . ఫిబ్రవరి 26 నుంచి మార్చి 31 మధ్య రెడ్ కేబుల్ క్లబ్‌కు తమ పరికరాన్ని లింక్ చేసే కస్టమర్‌లకు కంపెనీ అదనంగా రూ. 1,000 తగ్గింపును కూడా అందిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..