బడ్జెట్ ధరలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరిచయం చేస్తూ మార్కెట్లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది వన్‌ప్లస్ సంస్థ. ఇప్పటికే స్మార్ట్ ఫోన్‌లు, స్మార్ట్ టీవీల సెగ్‌మెంట్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న వన్‌ప్లస్ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ వాచ్ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో మంచి ఫీచర్లను అందించారు. తక్కువ బడ్జెట్‌లో విడుదల చేసిన ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి వివరాలు..
వన్‌ప్లస్ నార్డ్ వాచ్ సేల్ భారత్‌లో ప్రారంభమైంది. వన్‌ప్లస్.ఇన్, వన్‌ప్లస్ స్టోర్ యాప్‌లతో కొన్ని కొన్ని వన్‌ప్లస్ స్టోర్స్‌లో ఈ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ రోజు (అక్టోబర్ 4) నుంచి అమెజాన్‌లో సేల్ ప్రారంభంకానుంది. ఇక ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో హార్ట్ రేట్, స్లీపింగ్ ప్యాట్రన్స్, స్టెప్స్ వంటి యాక్టివిటీస్‌ను ట్రాక్ చేస్తుంది. ఈ వాచ్ బ్యాటరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 10 రోజులు నిరంతరాయంగా నడుస్తుంది.
ఈ వాచ్‌లో 1.78 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ను అందించారు. హెచ్‌డీ రిజల్యూషన్‌తో ఈ స్క్రీన్‌ను రూపొందించారు. రెక్టాంగిల్ డయల్‌ను ఇచ్చారు. ఇక ఈ స్మార్ట్ వాచ్‌లో మొత్తం 105 ఫిట్‌నెస్ మోడ్స్‌ను అందించారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్ భారత్‌లో రూ. 4,999కి అందుబాటులో ఉంది. యాక్సిస్ బ్యాంక్ కార్డుపై కొనుగోలు చేస్తే అదనంగా రూ. 500 డిస్కౌంట్ పొందొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..