ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ టీవీలు, స్మార్ట్ వాచ్ లను కూడా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఇటీవలే రూ.4999 ధరతో విడుదల చేసిన వన్ ప్లస్ నార్డ్ స్మార్ట్ వాచ్ వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ కంపెనీ తగ్గింపు ధరను ఆఫర్ చేస్తుంది. రూ.500 తగ్గిస్తూ రూ.4499 కు వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఈ స్మార్ట్ వాచ్ మిడ్ నైట్ బ్లాక్, డీప్ బ్లూ రంగుల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఈ వాచ్ కొనుగోలు చేస్తే ఇతర తగ్గింపు ఆఫర్లు కూడా వర్తించే అవకాశం ఉంది. ఈ వాచ్ ను ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.500 ఇన్ స్టెంట్ గా తగ్గుతుంది. అలాగే మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా కొంటే రూ.500 వరకూ క్యాష్ బ్యాక్ వస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..