Electrical Vehicles: Ola S1 ఎలక్ట్రికల్ స్కూటర్ విక్రయాలు ప్రారంభం.. ధర ఎంతంటే..

|

Sep 03, 2022 | 10:40 AM

కాలుష్య నివారణ కోసం పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో గతంలో పోలీస్తే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల..

Electrical Vehicles: Ola S1 ఎలక్ట్రికల్ స్కూటర్ విక్రయాలు ప్రారంభం.. ధర ఎంతంటే..
Ola S1
Follow us on

Electrical Vehicles: కాలుష్య నివారణ కోసం పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. దీంతో గతంలో పోలీస్తే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులకు అవసరమైన అనేక ఫీచర్లను అందిస్తూ అనేక కంపెనీలు ఈఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ బైక్ లు, కార్లు మార్కెట్లోకి వస్తున్నాయి. దీనిలో భాగంగా దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారి సంస్థ Ola ఎలక్ట్రిక్ స్కూటర్ S1 విక్రయాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారత్ లో ప్రారంభమయ్యాయి. కేవలం రూ.2,999 EMIతో ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులో కూడా మినహాయింపు ఇస్తున్నారు. Ola S1పేరుతో తాజాగా విడుదల చేసిన ఈ కొత్త మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్‌‌లో అత్యాధునిక ఫీచర్స్‌ను అందిస్తున్నారు. ఆగస్టు 15న రూ. 99,000 ఎక్స్-షోరూమ్ ధరతో ఈఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేయగా.. సెప్టెంబర్ 2 నుంచి అదే ధరకు కస్టమర్లు కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది కంపెనీ. ఈస్కూటర్ల స్టాక్ పరిమితంగా ఉందని.. ఇప్పటికే 70వేల యూనిట్లను విక్రయించినట్లు ఓలా కంపెనీ తెలిపింది. ఇప్పుడు Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుక్ చేసుకున్న వారికి సెప్టెంబర్ 7 నుండి డెలివరీ ప్రారంభమవుతుంది. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడంతో చాలా కంపెనీలకు ఈ రంగంలో పోటిపడుతున్నాయి. తక్కువ ధరతో అనేక ఎలక్ట్రిక్ బైక్‌లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి.

Ola S1 ఎలక్ట్రికల్ స్కూటర్ లో ఫీచర్స్: Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3kwh ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించారు. ఈ పవర్‌తో ఓలా ఎస్1 ఫుల్ ఛార్జింగ్‌తో 141 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బహుళ రైడింగ్ మోడ్‌లలో వస్తుంది. వినియోగదారులు ఎకో మోడ్‌ను పొందుతారు. ఇది 128 కిలోమీటర్ల వరకు మైలెజ్ ఇస్తుంది. సాధారణ మోడ్ 101 కిమీ పరిధిని ఇస్తుంది. Ola S1 స్పోర్ట్స్ మోడ్ 90 కిలోమీటర్లమీ పరిధిని అందిస్తుంది. Ola S1 గరిష్ట వేగం గంటకు 95 కిలోమీటర్లు అని కంపెనీ పేర్కొంది. Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరి డిజైన్‌నే కలిగి ఉంది. ఇది Led Drlలతో కూడిన Led హెడ్‌ల్యాంప్‌లు, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, Led టైల్‌లైట్లను కలిగిఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..