WhatsApp New Feature: ఇక హెచ్‌డీ ఫొటోలు కూడా షేర్ చేయొచ్చు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్..

|

Apr 03, 2024 | 12:47 PM

ముఖ్యమైన ఫొటోలను బంధుమిత్రులు, స్నేహితులకు పంపడానికి సాధారణంగా వాట్సాప్ ను ఉపయోగిస్తాం. అయితే దానిద్వారా ఫొటోలను వేరొకరికి పంపినప్పుడు క్వాలిటీ తగ్గిపోతుంది. దీంతో ఎంత అందమైన ఫొటోలైనా వేరొకరి వద్దకు వెళ్లేసరికీ డల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హై-డెఫినిషన్ (హెచ్ డీ) లో ఫొటోలు, వీడియోలను పంపడానికి వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.

WhatsApp New Feature: ఇక హెచ్‌డీ ఫొటోలు కూడా షేర్ చేయొచ్చు.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్..
Whatsapp
Follow us on

గతంలో ఫొటోలు తీసుకోవడం అనేది చాలా అరుదుగా జరిగేది. పెళ్లి, పుట్టిన రోజు, ఇతర శుభకార్యాల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగేవారు. లేకపోతే ఫొటో స్టూడియోకి వెళితే ఫొటో గ్రాఫర్ తీసేవాడు. అది కూడా ఏడాదికి రెండు, మూడుసార్లు మాత్రమే జరిగేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఫొటోగ్రఫీ హాబీ పెరిగిపోయింది. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ మనకు నచ్చిన విధంగా ఫొటోలు తీసుకుంటున్నాం. చెట్లు, పుట్టలు, అడవులు, కొండలు, లోయలు, నదులు, సముద్రం, జంతువులు అన్నింటితోనూ ఫొటో షూట్లు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఫొటో అనేది ఒక తీపి గుర్తు. కాలాన్ని వెనకకు తీసుకు వచ్చే శక్తి ఒక్క ఫొటోకు మాత్రమే ఉంటుంది. మన ఫోన్ లోని నాణ్యత కలిగిన కెమెరా సాయంతో అందమైన ఫొటోలు తీసినప్పటికి వాటిని వేరొకరికి పంపినప్పుడు వాటి నాణ్యత తగ్గిపోతుంది. ముఖ్యమైన ఫొటోలను బంధుమిత్రులు, స్నేహితులకు పంపడానికి సాధారణంగా వాట్సాప్ ను ఉపయోగిస్తాం. అయితే దానిద్వారా ఫొటోలను వేరొకరికి పంపినప్పుడు క్వాలిటీ తగ్గిపోతుంది. దీంతో ఎంత అందమైన ఫొటోలైనా వేరొకరి వద్దకు వెళ్లేసరికీ డల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హై-డెఫినిషన్ (హెచ్ డీ) లో ఫొటోలు, వీడియోలను పంపడానికి వాట్సాప్ కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దీనిద్వారా నాణ్యత తగ్గకుండా వేరొకరికి షేర్ చేయవచ్చు. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త అప్ డేట్ తో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ లో హెచ్ డీ ఫొటోలను పంపే విధానం..

  • ముందుగా మీరు వాట్సాప్‌ను తెరిచి, మీరు ఫైల్‌ను పంపాలనుకునే వారి చాట్‌కు వెళ్లాలి.
  • చాట్ తెరిచిన తర్వాత, చాట్‌బాక్స్‌కు కుడి వైపున ఉండే పేపర్‌ క్లిప్ చిహ్నంపై నొక్కండి.
  • మీ స్క్రీన్‌పై అనేక ఆప్షన్లు కనిపిస్తాయి.
  • వాటిలో కెమెరా ఆకారంలో ఉండే గ్యాలరీ అనే చిహ్నాన్ని క్లిక్ చేయండి.
  • మీరు పంపాలనుకుంటున్న వీడియో, ఫొటోలను ఎంచుకోండి.
  • చిత్రం పైన ఉన్న హెచ్ డీ బటన్ ను నొక్కండి.
  • హెచ్ డీ నాణ్యతను ఎంపికను ఎంచుకుని, ఆపై సెండ్ చేయండి.

ఐఫోన్ వినియోగదారుల కోసం..

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ని తెరచి, ఆపై మీరు ఫైల్‌ను పంపాలనుకునే వ్యక్తి చాట్ ను తెరవండి.
  • వారి స్క్రీన్ ఎడమ వైపున ఉన్న + చిహ్నంపై క్లిక్ చేయండి.
  • మీ స్క్రీన్ ఎడమ వైపున అనేక ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఛాయాచిత్రం ఆకారంలో ఉండే చిహ్నం కోసం వెతకండి. ఫోటో, వీడియో లైబ్రరీని పరిశీలించండి.
  • దానిపై నొక్కండి, ఆపై మీరు పంపాలనుకునే వీడియో, చిత్రాన్ని ఎంచుకోండి.
  • మీ స్క్రీన్ పైభాగంలో ఉన్న హెచ్ డీ బటన్‌పై నొక్కండి.
  • ఆపై హెచ్ డీని ఎంచుకుని, డన్ అనే బటన్ పై ప్రెస్ చేయండి. ఆపై ఫైల్ ను మీ స్నేహితుడికి పంపండి.
  • హెచ్ డీ ఫీచర్‌ కారణంగా కెమెరా నాణ్యతను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. వాటిని అదే నాణ్యతతో ఇతరులకు పంపవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..