Whatsapp: ఫోన్ నెంబర్‌ సేవ్‌ చేసుకోక పోయినా వాట్సాప్‌లో చాటింగ్ చేయొచ్చు.. ఎలాగో తెలుసుకోండి..

|

Dec 02, 2021 | 12:11 PM

Whatsapp: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న చాటింగ్‌ యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు ఈ రేంజ్‌లో క్రేజ్‌ ఉంది...

Whatsapp: ఫోన్ నెంబర్‌ సేవ్‌ చేసుకోక పోయినా వాట్సాప్‌లో చాటింగ్ చేయొచ్చు.. ఎలాగో తెలుసుకోండి..
Whatsapp
Follow us on

Whatsapp: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న చాటింగ్‌ యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది కాబట్టే ఈ యాప్‌కు ఈ రేంజ్‌లో క్రేజ్‌ ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫీచర్లలో మార్పులు చేర్పులు చేస్తుండడమే వాట్సాప్‌ ఈ స్థాయిలో సక్సెస్‌ కావడానికి కారణంగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే వాట్సాప్‌లో ఎవరికైనా మెసేజ్‌ చేయాలంటే కచ్చితంగా సదరు వ్యక్తి నెంబర్‌ మన ఫోన్‌లో ఉండాల్సిందే.. ఈ విషయం మనందరికీ తెలిసిందే.

అయితే నెంబర్‌ సేవ్‌ చేసుకోకుండానే మెసేజ్‌ను పంపించుకునే అవకాశం కూడా ఉందని మీలో ఎంత మందికి తెలుసు. అవును మీరు చదివింది నిజమే నెంబర్‌ సేవ్‌ చేసుకోకపోయినా వాట్సాప్‌లో మెసేజెస్‌ చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం కొన్ని స్టెప్స్‌ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక కేవలం వాట్సాప్‌ వెబ్‌ ద్వారా వాట్సాప్‌ ఉపయోగించే వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

ఫాలో అవ్వాల్సిన స్టెప్స్‌ ఇవే..

* ముందుగా కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ బ్రౌజర్‌ ఓపెన్‌ చేయాలి.

* అనంతరం బ్రౌజర్‌లో https://wa.me/ అని టైప్ చేసి పక్కన మీరు ఎవరికైతే మెసేజ్‌ చేయాలనుకుంటున్నారో వారి నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

* ఈ నెంబర్‌లో కంట్రీకోడ్‌ను కచ్చితంగా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

* ఆ తర్వాత ఎంటర్‌ నొక్కాలి. అనంతరం Continue to Chat పైన క్లిక్ చేయాలి.

* వెంటనే Open WhatsApp అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేయగానే వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ ఓపెన్‌ అవుతుంది.

* ఆ తర్వాత ఎంచక్కా చాటింగ్‌ చేసుకోవచ్చు.

Also Read: Bangarraju: బంగార్రాజు మూవీ నుంచి త్వరలో అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న సాంగ్ టీజర్..

Viral Video: ఈ డాగ్ భలే తుంటరి అబ్బా.. అప్పటివరకు నీరు పట్టింది.. అంతలోనే..

Viral Video: ఈ డాగ్ భలే తుంటరి అబ్బా.. అప్పటివరకు నీరు పట్టింది.. అంతలోనే..