Whatsapp: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా యాప్‌ను యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతూ వస్తోంది. ఇక వాట్సాప్ తాజాగా తీసుకొస్తున్న ఫీచర్‌తో పాత మెసేజ్‌లను సులభంగా సెర్చ్ చేసుకోవచ్చు. ఎవరితోనైనా చేసిన పాత చాటింగ్‌కు సంబంధించిన మెసేజ్‌లను తిరిగి పొందడానికి ఇప్పటి వరకు మనం సెర్చ్ బాక్స్‌లో సదరు మెసేజ్‌లో ఉన్న టెక్ట్స్‌తో సెర్చ్ చేసేవాళ్లం. అయితే ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను జోడించనున్నారు.
దీంతో ఇకపై యూజర్లు తేదీతో సెర్చ్ చేసుకోవచ్చు. తేదీల వారిగా వచ్చిన మెసేజ్‌లను ఫిల్టర్ చేసి చూడొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెర్చ్ బాక్స్‌పై క్లిక్ చేస్తే క్యాలెండర్ ఐకాన్ కనిపిస్తుంది. క్యాలెండర్‌పై క్లిక్ చేసి అందులో మీకు నచ్చిన తేదీని ఎంచుకుంటే సరిపోతుంది. వెంటనే ఆరోజు వచ్చిన మెసేజ్‌లుఓ చాట్ పేజీలో కనిపిస్తాయి. అలాగే కిందికి స్క్రోల్ చేస్తూ వెళితే ముందు రోజు మెసేజ్‌లు కూడా చూసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఐఓఎస్ బీటా వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. టెస్టింగ్ అనంతరం అందరరికీ ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే వాట్సాప్ సర్వే పేరుతో మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఏదైనా అంశంపై సర్వేను నిర్వహించుకునే అవకాశం దక్కనుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..