Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nokia 110: మార్కెట్ లోకి సరికొత్త నోకియా 110 ఫీచర్ ఫోన్..ధర ఎంతో తెలుసా..

నోకియా 1100 తరహలో సరికొత్త టెక్నాలజీతో అందరికీ అందుబాటు ధరల్లో నోకియా మరో ఫీచర్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. నోకియా 110(2022) మోడల్ ఫోన్ మనదేశంలో మూడు రంగుల్లో లభ్యమవుతోంది.

Nokia 110: మార్కెట్ లోకి సరికొత్త నోకియా 110 ఫీచర్ ఫోన్..ధర ఎంతో తెలుసా..
Nokia 110
Follow us
Amarnadh Daneti

|

Updated on: Aug 06, 2022 | 1:08 PM

Nokia New Phone: నోకియా 1100 ఈఫోన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు చాలా మంది ఈఫోన్ వాడే ఉంటారు. ఇప్పటికి కొంత మంది తాము వాడిన మొదటి ఫోన్ అంటూ దీనిని గుర్తుగా ఉంచుకున్న వాళ్లు లేకపోలేదు. ఇప్పుడు దీనిగురించి ఎందుకనుకుంటున్నారా.. నోకియా 1100 తరహలో సరికొత్త టెక్నాలజీతో అందరికీ అందుబాటు ధరల్లో నోకియా మరో ఫీచర్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. నోకియా 110(2022) మోడల్ ఫోన్ మనదేశంలో మూడు రంగుల్లో లభ్యమవుతోంది. రంగుల ఆధారంగా ఫోన్ ధరలో స్వల్ప మార్పులు ఉన్నాయి. సియాన్, చార్ కోల్ రంగుల్లో అయితే రూ.1699గా, రోజ్ గోల్డ్ వేరియంట్ ధరను రూ.1799గా కంపెనీ నిర్ణయించింది. ఈఫోను కొనుగోలుచేస్తే రూ.299 విలువైన ఇయర్ ఫోన్స్ ను ఉచితంగా పొందొచ్చు.

నోకియా 110 (2022)లో స్పెసిఫికేషన్లు : నోకియా కంపెనీ విడుదల చేసిన ఈకొత్త ఫోనులో ఆటో కాల్ రికార్డింగ్ ఆప్షన్ తో పాటు వెనుక వైపు ఇన్ బిల్ట్ రేర్ కెమెరా, టాప్ ఎడ్జ్ లో ఎల్ ఈడీ ఫ్లాష్ లైట్ ఉన్నాయి. వీటితో పాటు మ్యూజిక్ ప్లేయర్ అందుబాటులో ఉంది. మైక్రో ఎస్ డీ కార్డు స్లాట్ అందుబాటులో ఉండగా..దీని ద్వారా ఫోన్ డేటా స్టోరేజిని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్నేక్ గేమ్ సహా మరికొన్ని గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. వైర్ లెస్, వైర్డ్ ఎఫ్ ఎం రేడియో వంటి ఎన్నో ఫీచర్లు ఈఫోన్ లో ఉన్నాయి. 1000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈఫోన్ కలిగి ఉంది. 8వేలకు పైగా పాటలను స్టోర్ చేసుకునే సామర్థ్యం ఈఫోన్ కు ఉందని కంపెనీ తెలిపింది. నోకియా 110 2022 ఎడిషన్ ఫీచర్ ఫోన్ తో పాటు నోకియా 8120 4G ఫీచర్ ఫోన్ ను కంపెనీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈరెండు ఫోన్లు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండగా.. సరికొత్త డిజైన్ తో మొబైల్ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..