Banking: ఆ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి సరికొత్త సేవలు.. పూర్తి వివరాలు..
HDFC Whatsapp: బ్యాంకింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వినియోగదారులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇలా తీసుకొచ్చిన వాటిలో వాట్సాప్ సేవలు ఒకటి...
HDFC Whatsapp: బ్యాంకింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వినియోగదారులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇలా తీసుకొచ్చిన వాటిలో వాట్సాప్ సేవలు ఒకటి. ప్రస్తుతం బ్యాంకులు తమ యూజర్ల కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం HDFC కూడా ఖాతాదారుల కోసం వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీని ద్వారా 90కి సేవలను వాట్సాప్ అందిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. బ్యాంక్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఈ సేవలను పొందొచ్చు. ఇందు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ చాట్ అసిస్ట్‌తో పాటు 90కిపైగా బ్యాంకింగ్ సేవలను అందించనున్నారు. ఈ సర్వీసులను ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా పొందొచ్చని వాట్సాప్ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ తరహా సేవలను ఎస్‌బీఐ ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
వాట్సాప్ సేవలను ఎలా పొందాలంటే..
* ఇందుకోసం ఖాతాదారులు ముందుగా 7070022222 నెంబర్‌ను కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవాలి.
* ఆ తర్వాత మీరు బ్యాంకులో రిజిస్టర్ చేసుకున్న నెంబర్ నుంచి 7070022222కి ‘హాయ్’ అని లేదా ‘రిజిస్టర్’ అని మెసేజ్ చేయాలి.
* అనంతరం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
* వెంటనే బ్యాంక్ అందించే సేవల తాలుకూ సర్వీసెస్ జాబితా కనిపిస్తాయి. దాంట్లో నుంచి మీకు కావాల్సిన సర్వీస్‌ను ఎంచుకొని మెసేజ్ చేస్తే సరిపోతుంది.
Smart Chat Assist, 90+ Banking Services, Intuitive AI and whole lot more, are now in the palm of your hand with the all-new HDFC Bank ChatBanking on WhatsApp
So, drop in and say ‘Hi’ on 7070022222 for a super friendly banking experience!#BankTheWayYouLive pic.twitter.com/nUJwOKxVsE
— HDFC Bank (@HDFC_Bank) August 1, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..