ఈ మధ్య కాలంలో కంప్యూటర్ యూజర్లంతా ఎక్కువగా బ్రౌజ్ చేయడానికి గూగుల్ క్రోమ్‌నే వాడుతున్నారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు గూగుల్ సపోర్ట్ ఉండడంతో అంతా ఇష్టపడుతున్నారు. అయితే క్రోమ్ యూజర్లకు వేధించే అసలు సమస్య చార్జింగ్. క్రోమ్ వాడుతున్నప్పుడు ల్యాప్ టాప్ లేదా ట్యాబ్ చార్జింగ్ చాలా స్పీడ్‌గా అయ్యిపోతుందని ఫీలవుతుంటారు. ఈ నేపథ్యంలో గూగుల్ కూడా వెబ్ బ్రౌజర్ పనితీరును మెరుగుపర్చడానికి బ్యాటరీ జీవితాన్ని పొడిగించడానికి కొత్త అప్‌డేట్‌ను అందిస్తుంది. గతేడాది డిసెంబర్‌లో మ్యాక్, విండోస్, లినక్స్ అలాగే క్రోమ్ బుక్స్‌లో క్రోమ్ కోసం ఎనర్జీ, మెమరీ సేవర్ మోడ్‌లను ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ ఫీచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మోడ్‌ను గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరికీ మాత్రం ఈ మోడ్ ఆటోమెటిక్‌గా ఎనెబుల్ అయ్యింది. ఈ మోడ్‌ను ఆన్-ఆఫ్ చేసే సామర్థ్యం ఉన్నా బ్యాటరీ లైఫ్‌ను వేగంగా మెరుగుపరుస్తుంది.
క్రోమ్‌లోని మెమరీ సేవర్ మోడ్ ఇనాక్టివ్ ట్యాబ్‌ల నుంచి మెమరీని ఖాళీ చేస్తుంది. వినియోగదారుల కంప్యూటర్‌లలోని ఇతర పేజీలు మరియు యాప్‌లకు మరిన్ని వనరులను అందించడంలో ఈ ఫీచర్ సహాయం చేస్తుంది. మీరు మీ బ్రౌజర్‌లో అనేక ట్యాబ్‌లను తెరిచి ఉంచినట్లయితే మరియు మీరు వాటిలో కొన్నింటిని కొంతకాలంగా ఉపయోగించకుంటే, స్థలాన్ని ఖాళీ చేయడానికి క్రోమ్ వాటిని మీ కంప్యూటర్ మెమరీ నుండి స్వయంచాలకంగా తీసివేస్తుంది. అయితే, మీరు ఆ ట్యాబ్‌లకు తిరిగి మారినప్పుడు క్రోమ్ వాటిని స్వయంచాలకంగా రీలోడ్ చేస్తుంది మరియు వాటిని మీ బ్రౌజర్ మెమరీలోకి తిరిగి తీసుకువస్తుంది. కొత్త మెమరీ సేవర్ మోడ్ వినియోగదారులను ఈ ఫీచర్ ద్వారా ప్రభావితం చేయకూడదనుకునే నిర్దిష్ట వెబ్‌సైట్‌లను ఎంచుకోవడానికి కూడా అనుమతిస్తుంది.
మెమరీ సేవర్ మోడ్ మాదిరిగానే పరికరాల బ్యాటరీపై ఆదా చేయడానికి కొత్త ఎనర్జీ సేవర్ ఫీచర్ అభివృద్ధి చేశారు. బ్రౌజర్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని పరిమితం చేయడం ద్వారా నిర్దిష్ట యానిమేషన్‌లు, వీడియో ఫ్రేమ్ రేట్‌లను డిజేబుల్ చేయడం ద్వారా స్మూత్ స్క్రోలింగ్ ఫీచర్‌ను డిజేబుల్ చేయడం ద్వారా శక్తిని ఆదా చేస్తుంది. ఈ ఫీచర్ ప్రాధాన్యత ప్రకారం ఎనర్జీ సేవర్ మోడ్‌ను సెట్ చేయడానికి రెండు ఎంపికలను జోడించింది. ఎనర్జీ సేవర్ మోడ్‌ని ఆన్/ఆఫ్ చేయడం కాకుండా క్రోమ్ వినియోగదారులు వీటిని కూడా ఎంచుకోవచ్చు. అయితే బ్యాటరీ 20 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీచర్‌ను ఆన్ చేయాలి. ఈ ఫీచర్‌ను క్రోమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..