ప్రపంపచవ్యాప్తంగా ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు కొత్త మోడల్స్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో యాపిల్ ఉత్పత్తులు రారాజుగా నిలుస్తున్నాయి. అందులో వచ్చే ఫీచర్లు యువతను ఎక్కువగా ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా యాపిల్ ఫోన్ వాడడం అనేది ఓ స్టేటస్ సింబల్‌లా ఫీలవుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 12న యాపిల్ తన అత్యంత ప్రసిద్ధమైన వండర్‌లస్ట్‌ను నిర్వహించింది. ఇది సంవత్సరంలో అతిపెద్ద ఈవెంట్. ఇతర ఉత్పత్తులతో పాటు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 లైనప్‌ను కూడా ఈ ఈవెంట్‌లో ప్రకటించారు. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ నాలుగు సరికొత్త ఐఫోన్ మోడల్స్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ అనేది ఐఫోన్ 15 సిరీస్‌కు యాపిల్ చేసిన ముఖ్యమైన మార్పులలో ఒకటి. గత కొంత కాలంగా రూమర్స్ లో ఉన్న సూపర్ ఛార్జింగ్ పోర్ట్ కు యాపిల్ గుడ్ బై చెప్పనుందని ప్రకటించగానే ఐఫోన్ లవర్స్ నిరాశకు గురయ్యారు. అయితే బ్యాటరీ బ్యాకప్‌ను పెంచడానికి యాపిల్ ఈ చర్య తీసుకుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాటరీ బ్యాకప్‌ను పెంచడానికి యాపిల్ ఎలాంటి చర్యలు తీసుకుందో? ఓ సారి తెలుసుకుందాం.
ఇటీవల నివేదికల ప్రకారం ఐఫోన్ 15 దాని బ్యాటరీ బ్యాకప్‌ను మెరుగుపరచడంలో సహాయపడే మరొక ఫీచర్‌ను కలిగి ఉంటుందని పేర్కొంటున్నాయి. మొత్తం ఐఫోన్ 15 లైనప్‌లో ఫోన్‌లను 80 శాతం ఛార్జ్ చేయకుండా నిషేధించే ఎంపిక ఉంది. ఈ సెట్టింగ్ యాక్టివ్‌గా ఉన్నప్పుడు మీ ఫోన్ 80 శాతం కంటే ఎక్కువ ఛార్జ్ చేయదు. మీ ఫోన్‌ను 100 శాతం కాకుండా 80 శాతానికి ఛార్జ్ చేయడం వల్ల దాని బ్యాటరీ జీవితాన్ని పొడిగించవచ్చని తెలిపినందున ఇలా చేయడం వల్ల ఫోన్ మొత్తం బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
యాపిల్ గతంలో ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అనే ఫీచర్‌ను కలిగి ఉంది. అది మీ ఫోన్‌ను 80 శాతం దాటి ఛార్జ్ చేయకుండా నిరోధిస్తుంది. ఐఫోన్ 15లోని ఈ కొత్త సెట్టింగ్ ఇతరులకు భిన్నంగా ఉంటుంది. అదనంగా ఐఫోన్ 15 సిరీస్ మూడు సెట్టింగ్‌ల ఎంపికలను అందిస్తుంది. బ్యాటరీ, బ్యాటరీ ఆరోగ్యం, ఛార్జింగ్, ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ ఎంపికలను అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..