ఇటీవల వాట్సాప్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఈ ఇన్‌స్టంట్ మేసేజ్ యాప్ ద్వారా మెజేజ్‌లతో పాటు మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు, ఆడియో ఫైల్స్, ఇతర ఫైల్స్ కూడా పంపే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది ఈ యాప్‌ను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకోడానికి వాట్సాప్ కూడా కొత్త అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇస్తుంది. అయితే ఇటీవల వాట్సాప్ ఓ కొత్త అప్‌డేట్‌ను ఇచ్చింది. ముఖ్యంగా తమ మూడ్‌ను తెలియజేసేందుకు యూజర్లు స్టేటస్‌లు పెడుతూ ఉంటారు. ఆ స్టేటస్‌లకు వివిధ రిప్లైస్ ఇచ్చేలా కొత్త అప్‌డేట్‌ను వాట్సాప్ పరిచయం చేసింది. ఎమోజీలతో పాటు, వాయిస్ మేసేజ్‌స్ ద్వారా కూడా రిప్లై పంపేలా సరికొత్త ఫీచర్‌ను జోడించింది. ఈ అప్‌డేట్‌తో పాటు మరో కొత్త ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ఫీచర్ గురించి ఓ సారి తెలుసుకుందాం.
ప్రస్తుతం వాట్సాప్ ద్వారా గరిష్టంగా 30 ఫొటోలను పంపే అవకాశం ఉంది. ఇప్పుడు దాన్ని వంద ఫొటోలు పంపేలా అప్‌డేట్ చేశారు. అలాగే వీడియోలను అదే స్థాయిలో పంపే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్ ఫొటోలు షేర్ చేసే వారికి కచ్చితంగా ఉపయోగపడుతుంది.
గ్రూప్ లేదా చాట్‌లో డాక్యుమెంట్ షేర్ చేసే సమయంలో ఎలాంటి క్యాప్షన్‌ను జత చేసే అవకాశం గతంలో ఉండేది కాదు. ఇప్పుడు డాక్యుమెంట్స్‌కు కూడా కాప్షన్ జోడిండే అవకాశం కల్పించింది.
వాట్సాప్ గ్రూప్ సబ్జెక్ట్‌కు క్యారెక్టర్ లిమిట్‌ను భారీగా పెంచింది. ఇంతకు ముందు 25 అక్షరాల లిమిట్‌తో ఉండేవి. 100 అక్షరాల వరకూ టైప్ చేసుకునే అవకాశం ఉంది. గ్రూప్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోడానికి మారిన ఫీచర్ ఉపయోగపడుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కొత్త అపడేట్‌తో యూజర్లు హోమ్ స్క్రీన్‌లో ఉన్న సెట్టింగ్స్‌కు వెళ్లి వ్యక్తీకరించిన పాత్రను సృష్టించే అవకాశం ఉంది. అలాగే అదనపు స్టిక్కర్లను జోడించే అవకాశం ఉంది. ఈ ఫీచర్ చాలా రోజుల క్రితమే ప్రకటించినా ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..