Smartwatch: ట్రెండ్‌కు తగ్గట్లుగా ఖతర్నాక్ ఫీచర్లతో స్మార్ట్ వాచ్.. లుక్ చూస్తే వేరే లెవెల్ అంతే..

|

Aug 27, 2023 | 6:00 PM

పెబుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ తో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ అయ్యింది. 1.43 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లేతో ఎప్పుడూ ఆన్ మోడ్ లోనే ఉండే వృత్తాకార డైల్ తో ఈ స్మార్ట్ వాచ్ ఉంది. లెదర్ బెల్ట్, జీఓటీ థీమ్ వాచ్ ఫేస్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీనిలో వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్లు, ఫిట్ నెస్ కార్యకలాపాలు ట్రాక్ చేయొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Smartwatch: ట్రెండ్‌కు తగ్గట్లుగా ఖతర్నాక్ ఫీచర్లతో స్మార్ట్ వాచ్.. లుక్ చూస్తే వేరే లెవెల్ అంతే..
Pebble Game Of Thrones Smartwatch
Follow us on

ప్రస్తుతం ట్రెండీ టెక్ గ్యాడ్జెట్ ఏదైనా ఉంది అంటే స్మార్ట్ వాచ్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ తమ మణికట్టుకు అత్యాధునికి ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్ ఉండాలని కోరుకుంటున్నారు. దానిలో హెల్త్ ఫీచర్లు, ఫిట్ నెస్ ఫీచర్లు అటు యువతను, ఇటు పెద్దలనూ కూడా ఆకర్షిస్తున్నాయి. దీంతో కంపెనీలు కూడా పోటాపోటీగా ఉత్పత్తులను సరికొత్త ఫీచర్లు, ఆకర్షణీయ డిజైన్లతో లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో పెబుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ తో కొత్త స్మార్ట్ వాచ్ లాంచ్ అయ్యింది. 1.43 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లేతో ఎప్పుడూ ఆన్ మోడ్ లోనే ఉండే వృత్తాకార డైల్ తో ఈ స్మార్ట్ వాచ్ ఉంది. లెదర్ బెల్ట్, జీఓటీ థీమ్ వాచ్ ఫేస్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీనిలో వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్లు, ఫిట్ నెస్ కార్యకలాపాలు ట్రాక్ చేయొచ్చు. ఈ కొత్త స్మార్ట్ వాచ్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

పెబుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్మార్ట్‌వాచ్ ధర, లభ్యత..

పెబుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 5,499గా ఉంది. ఇది పెబుల్ వెబ్ సైట్, ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ లో విక్రయాలకు అందుబాటులో ఉంది. ఇది బ్లాక్, గ్రే, గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

పెబుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు..

పెబుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్మార్ట్ వాచ్ లో లెదర్ పట్టీలు, కిరీటం ఆకారపు బటన్ తో వృత్తాకార డయల్ ఉంటుంది. 1.43 అంగుళాల అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. ఆల్ వేస్ ఆన్ మోడ్ ఇచ్చారు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంది. దీంతో ఈ స్మార్ట్ వాచ్ ను సెల్ ఫోన్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ఫోన్లకు మద్దతు ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

పెబుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్మార్ట్ వాచ్ లో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు(ఎస్పీఓ2), హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్లు, ఫిట్ నెస్ ట్రాకర్లు అందుబాటులో ఉన్నాయి. ఐపీ 67 రేటింగ్ తో దుమ్మూ, నీటి నిరోధకతను కలిగి ఉంది.

దీనిలోని బ్యాటరీ 250ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. ఇది ఒక్కసారి ఫుల్ గా చార్జ్ చేస్తే ఏడు రోజుల వరకూ లైఫ్ ఉంటుంది. మాగ్నెటిక్ చార్జింగ్ కు సపోర్టు చేస్తుంది. కాలిక్యులేటర్ యాప్, అలారం ఉంటాయి. వాచ్ డిస్ ప్లేను టార్చ్, స్టాప్ వాచ్ లా వాడొచ్చు. మ్యూజిక్ కంట్రోల్స్ కూడా వాచ్ నుంచే చేయొచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..