ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రెడ్ మీ భారతదేశంలో తన పరిధిని విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక రకాల స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలతో తో తన మార్కెట్ ను పెంచుకున్న రెడ్ మీ.. ఇప్పుడు మరో కొత్త స్మార్ట్ టీవీని మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తో కలసి తన ఫైర్ టీవీని రెడ్ మీ లాంచ్ చేసింది. ఇది ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఇంకా మరిన్ని ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికతను జోడించారు. అంతేకాక అతి తక్కువ బడ్జెట్ లో దీనిని ఆవిష్కరించింది. 32 అంగుళాల కేవలం రూ. 12,000 ధరతోనే వినియోగదారులకు అందుతోంది. అంతేకాక అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. దీనికి సంబంధించిన పూర్త వివరాలు ఇప్పుడు చూద్దాం..
షియోమీ అనుబంధ సంస్థ ఫైర్ ఓఎస్ ఆధారిత మొదటి స్మార్ట్ టీవీని ఆవిష్కరించింది. ఇందుకోసం షియోమీ అమెజాన్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిలో వివిడ్ పిక్చర్ ఇంజిన్, డాల్బీ ఆడియో కలిగి ఉంది. దీని సాధారణ ధర రూ. 13,999గా నిర్ధారించింది. ఇది ఎంఐ అధికారిక వెబ్ సైట్, అమెజాన్ ప్లాట్ ఫాంపై అందుబాటులో ఉంది. ప్రారంభ ఆఫర్ కింద రూ. 1000 తగ్గింపు అందిస్తున్నారు. అంటే కేవలం రూ. 11,999కే ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటుంది.
వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ వీడియోలను మరింత అందంగా చూపిస్తుంది. ఈ ఫైర్ టీవీలో 20 వాట్స్ పవర్ ఫుల్ స్పీకర్స్ ఉన్నాయి. 1 జీబీ ర్యామ్- 8 జీబీ స్టోరేజ్ కూడా లభిస్తోంది. ఈ టీవీ రిమోట్ లో అన్నీ కంట్రోల్స్ ఉంటాయి. ఇన్ బిల్ట్ అలెక్సా బటన్ కూడా ఉంటుంది. ఎయిర్ ప్లే, మిరాకాస్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇందులోని ఫైర్ ఓఎస్ 7ను బట్టి ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, యూట్యూబ్ వంటి వాటితో పాటు మరిన్నింటితో సహా ఫైర్ టీవీ యాప్ స్టోర్ నుంచి 12,000కు పైగా యాప్‌లను వినియోగించుకోవచ్చు. మార్చి 21 నుంచి ఈ టీవీ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..