
మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. అధికారులు, పోలీసులు, మీడియా ఎన్ని రకాల ప్రచారాలు కనిపిస్తున్నా నేరాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. సైబర్ నేరస్థులు రోజుకో కొత్త మార్గంలో ప్రజలను నిండా ముంచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
ఈ స్కామ్ బారిన పడి ప్రజలు డబ్బులు కోల్పోతున్నారని కేంద్రం అలర్ట్ చేసింది. ఈ చలాన్ పేరుతో ఈ కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇంతకి ఈ స్కామ్ ఏంటి.? అసలు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారా.? ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్ విధించడం సర్వసాధారణమైన విషయం అని తెలిసిందే. ప్రస్తుతం చలాన్‌ను నేరుగా వాహన యజమానుల మొబైల్ ఫోన్‌కు పంపిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక లింక్‌ను పంపిస్తున్నారు. యూజర్లు సదరు లింక్‌ను క్లిక్ చేసి ట్రాఫిక్ నిబంధనను ఎక్కడ ఉల్లంఘించారన్న విషయాన్ని ప్రూఫ్‌తో సహా చూసి అక్కడే జరిమానా పే చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే దీనిని ఆసరగా తీసుకొని కొందరు నేరస్థులు ప్రజలను మోసం చేస్తున్నారు.
అచ్చంగా ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చినట్లు నకిలీ మెసేజ్‌ను, నకిలీ లింక్‌ని క్రియేట్ చేసి మొబైల్ ఫోన్‌లకు పంపిస్తున్నారు. పొరపాటున ఈ లింక్స్‌ను క్లిక్ చేశారంటే ఇక మీ పని అంతే. సైబర్ క్రిమినల్స్ చేతిలో మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను పెట్టినట్లు అవుతుంది. అందుకే పొరపాటున కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇందకు సంభందించి ఈచలాన్‌కు సంబంధించిన ఒరిజినల్ లింక్‌తో పాటు, ఫేక్ లింక్‌ను తెలియజేస్తూ ఓ పోస్టర్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..