ప్రస్తుత రోజుల్లో యువత యాపిల్ ప్రొడెక్ట్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచంలోనే యాపిల్ ఉత్పత్తులపైనే ఓ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో యాపిల్ కూడా వివిధ ఉత్పత్తులను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తూ వినియోగదారుల అంచనాలను అందుకుంటుంది. ముఖ్యంగా యాపిల్ ఉత్పత్తుల్లో ఇటీవల స్మార్ట్‌వాచ్‌లకు ఎక్కువ క్రేజ్ ఏర్పడింది. యాపిల్ ఫోన్ కొనుగోలు చేసిన వారు కచ్చితంగా తమ వద్ధ యాపిల్ స్మార్ట్‌వాచ్ ఉండాలని కోరుకుంటున్నారు. పలు సంస్థల నివేదికల ప్రకారం యాపిల్ కంపెనీ ప్రస్తుతం థర్డ్ జనరేషన్ స్మార్ట్‌వాచ్‌లను రూపొందిస్తుందని తెలుస్తోంది. అతి పెద్ద డిస్‌ప్లేతో యాపిల్ వాచ్ సిరీస్ ఎక్స్, ఎస్ఈలను రూపొందిస్తుంది. ఈ వాచ్‌లను 2024 లో రిలీజ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
ముఖ్యంగా యాపిల్ ఎస్ఈ సిరీస్ స్మార్ట్‌వాచ్‌ల్లో 1.89 అంగుళాల డిస్‌ప్లే నుంచి 2.04 అంగుళాల డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. అలాగ ఈ వాచ్ కేస్ పరిమాణాన్ని బట్టి యాపిల్ వాచ్ సిరీస్ 8 కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. అలాగే రెక్ట్‌యాంగిల్ హై డిజైన్‌డ్ ఫ్రేమ్‌తో వినియోగదారులను ఆకట్టుకునే ఈ వాచ్ డిజైన్ ఉండనుంది. అయితే వాచ్ డిజైన్ బట్టి డయల్ సైజ్ పెద్దగా ఉన్నా డిస్‌ప్లే సైజ్ చిన్నదిగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే యాపిల్ వాచ్ ఎక్స్ సిరీస్‌లో ఐఫోన్ ఎక్స్ మాదిరిగా బ్రాండింగ్ స్మార్ట్‌వాచ్‌లా నిలుస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ వాచ్‌లకు కంపెనీ పేరును వెల్లడించలేదు. అందువల్ల మార్కెట్‌లో అంతా ఈ వాచ్‌లను సిరీస్ ఎక్స్‌గా పిలుస్తున్నారు. అలాగే ప్రస్తుతం రిలీజ్ చేసే థర్డ్ జనరేషన్ యాపిల్ వాచ్‌ల్లో యాపిల్ సిరీస్ 8 వాచ్‌ల మాదిరిగానే డిస్‌ప్లే సైజ్ ఉంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఇప్పుడు రిలీజ్ చేసే వాచ్‌లను కూడా యాపిల్ 9 సిరీస్ వాచ్ పేరుతో రిలీజ్ చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అయితే పలువురు మార్కెట్ నిపుణులు మాత్రం యాపిల్ 9 సిరీస్ వాచ్‌ల్లో డిస్‌ప్లే సైజ్ 2.13 అంగుళాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..