Jio With Netflix: జియోతో జత కట్టిన నెట్‌ఫ్లిక్స్‌.. ప్రత్యేక రీచార్జీ ప్లాన్స్ విడుదల

|

Aug 24, 2023 | 7:30 AM

ప్రజలకు మూవీ మజాను అందించేందుకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చాయి. అయితే మొబైల్‌ రీచార్జ్‌తో పాటు ఓటీటీ రీచార్జ్‌లు చేయడం యువతకు కొంత భారంగా మారాయి. ఈ నేపథ్యంలో అలాంటి వారికి ఊరట కల్పిస్తూ జియో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌తో జత కట్టింది. రీచార్జీ ప్లాన్‌తోనే నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ వచ్చేలా కొత్త ప్లాన్‌ను ప్రకటించింది.

Jio With Netflix: జియోతో జత కట్టిన నెట్‌ఫ్లిక్స్‌.. ప్రత్యేక రీచార్జీ ప్లాన్స్ విడుదల
Jio Netflix
Follow us on

టెలికాం రంగంలో జియో వచ్చాక సంచలనాలు నమోదయ్యాయి. జియో నెట్‌వర్క్‌ దెబ్బకు అన్ని కంపెనీలు తక్కువ ధరకే డేటాను వినియోగదారులను అందిస్తున్నాయి. అయితే కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఓటీటీ సేవలు ప్రజలకు చేరువయ్యాయి. ప్రజలకు మూవీ మజాను అందించేందుకు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ప్రత్యేక ప్యాకేజీలను తీసుకొచ్చాయి. అయితే మొబైల్‌ రీచార్జ్‌తో పాటు ఓటీటీ రీచార్జ్‌లు చేయడం యువతకు కొంత భారంగా మారాయి. ఈ నేపథ్యంలో అలాంటి వారికి ఊరట కల్పిస్తూ జియో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌తో జత కట్టింది. రీచార్జీ ప్లాన్‌తోనే నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ వచ్చేలా కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. కాబట్టి ఈ తాజా రీచార్జ్‌ ప్లాన్‌ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం. 

జియో-నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ రూ. 1099

  • చెల్లుబాటు – 84 రోజులు
  • రూ. 149 విలువైన నెట్‌ఫ్లిక్స్ (మొబైల్) ప్లాన్
  • జియో వెల్‌కమ్ ఆఫర్‌తో అపరిమిత 5 జీ డేటా
  • అపరిమిత వాయిస్ కాల్స్‌తో రోజుకు 2 జీబీ డేటా

జియో-నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ రూ. 1400

  • చెల్లుబాటు – 84 రోజులు
  • నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ (ప్రాథమిక) విలువ రూ.199
  • జియో వెల్‌కమ్ ఆఫర్‌తో అపరిమిత 5జీ డేటా
  • అపరిమిత వాయిస్ కాల్స్‌తో రోజుకు 3 జీబీ డేటా

జియో మినహా మరే ఇతర టెలికాం కంపెనీ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆఫర్ చేయలేదు. ఈ డీల్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌లు, జియో ప్రీపెయిడ్ కస్టమర్‌లను పెంచుతుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. జియోతో మా సంబంధాన్ని విస్తరించడానికి మేము సంతోషిస్తున్నామని నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు. జియో మా కొత్త ప్రీపెయిడ్ బండిల్ భాగస్వామ్యం మరింత మంది కస్టమర్‌లకు భారతీయ కంటెంట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని అద్భుతమైన కథనాల ఉత్తేజకరమైన లైనప్‌కు యాక్సెస్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..