
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో సరికొత్త పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని పరిశోధనలు నమ్మలేని విధంగా సక్సెస్ అవుతున్నాయి. ఎలాన్ మస్క్‌కు సంబంధించిన బ్రెయిన్ సైన్స్ స్టార్టప్ న్యూరాలింక్ ఇటీవల ఓ ఘనతను సాధించింది. వీడియో లైవ్ స్ట్రీమ్‌లో పక్షవాతం వచ్చిన రోగి హ్యాపీగా కంప్యూటర్‌లో చెస్ ఆడుతున్నాడు. వినడానికి కొత్తగా ఉన్నా అతడు కేవలం ఆలోచనలతోనే కంప్యూటర్‌లో చెస్ ఆడుతున్నారు. టెక్ బిలియనీర్ “టెలిపతి” అని పిలిచే ఈ బ్రెయిన్ ఇంప్లాంట్‌కు సంబంధించిన వీడియోను ఎక్స్ రీ ట్వీట్ చేశాడు. అసలు బ్రెయిన్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్‌కు ఎలన్ మస్క్‌కు ఉన్న సంబంధం ఏంటి వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
న్యూరాలింక్ విడుదల చేసిన వీడియోలో పక్షవాతానికి గురైన 29 ఏళ్ల నోలాండ్ అర్బాగ్ తన కంప్యూటర్‌ను నియంత్రించడానికి ఇంప్లాంట్‌ను ఉపయోగిస్తున్నాడో? ఉంది. ఆ వీడియోలో అతను కేవలం ఆలోచించడం ద్వారా కర్సర్‌ను కదిలిస్తాడు. ముఖ్యంగా కంప్యూటర్‌లో చెస్ ఆడడంతో పాటు, సంగీతాన్ని నియంత్రిస్తాడు. న్యూరాలింక్ ఇంజనీర్‌తో సంభాషణలో అర్బాగ్ చిప్‌ని ఉపయోగించిన తన అనుభవాన్ని పంచుకున్నాడు. అయితే ఎలన్ మస్క్ ఈ వీడియోను మళ్లీ ఎక్స్‌లో రీట్వీట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈ ట్వీట్ 27 మిలియన్లకు పైగా వ్యూస్‌తో వైరల్‌గా మారింది. దీనికి ప్రజల నుండి అనేక కామెంట్లు కూడా వస్తున్నాయి.
Livestream of @Neuralink demonstrating “Telepathy” – controlling a computer and playing video games just by thinking https://t.co/0kHJdayfYy
— Elon Musk (@elonmusk) March 20, 2024
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..