Motorola Edge S Pro: మోటొరోలా కొత్త ఫోన్ విడుదల.. ఫీచర్లలో హైఎండ్.. ధర మాత్రం మిడ్ రేంజ్..!

|

Aug 07, 2021 | 5:57 AM

మోటొరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. మోటొరోలా ఎడ్జ్ ఎస్ ప్రో (Motorola Edge S Pro) పేరుతో రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోన్ మోటొరోలా ఎడ్జ్ ఎస్‌కి తరువాతి వెర్షన్‌గా విడుదలైంది.

Motorola Edge S Pro: మోటొరోలా కొత్త ఫోన్ విడుదల.. ఫీచర్లలో హైఎండ్.. ధర మాత్రం మిడ్ రేంజ్..!
Motorola Edge S Pro, Motorola Edge Lite
Follow us on

Motorola Edge S Pro: మోటొరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. మోటొరోలా ఎడ్జ్ ఎస్ ప్రో (Motorola Edge S Pro) పేరుతో రిలీజ్ చేసింది. అయితే ఈ ఫోన్ మోటొరోలా ఎడ్జ్ ఎస్‌కి తరువాతి వెర్షన్‌గా విడుదలైంది. గతేడాది యూరోప్‌లో విడుదలైన మోటొరోలా ఎడ్జ్ 20 ప్రో స్పెసిఫికేషన్లను పోలి ఉంది. ఈ ఫోన్144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోపాటు ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో విడుదలైంది. పెరిస్కోప్ లెన్స్‌తో ట్రిపుల్-రియర్ కెమెరాలు, 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా ఎన్నో స్పెసిఫికేషన్‌లు ఇందులో ఉన్నాయి. మోటరోలా ఎడ్జ్ ఎస్ ప్రోతో పాటు, కంపెనీ మోటరోలా ఎడ్జ్ లైట్‌ను విడుదల చేసింది.

మోటొరోలా ఎడ్జ్ ఎస్ ప్రో ధర
మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదల అయ్యాయి. ప్రారంభ మోడల్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 2,499 యువాన్లు(సుమారు రూ.28,700)కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర 2,699 యువాన్లు(సుమారు రూ.31,000), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 2,999 యువాన్లు(సుమారు రూ.34,400)గా ఉన్నాయి. అలాగే ఇందులో హై ఎండ్ మోడల్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 3,299 యువాన్లు(సుమారు రూ.37,800)గా ఉంది.

స్పెసిఫికేషన్లు
మైయూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా మైయూఐ ఓఎస్ తయారు చేశారు. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. ఇందులో వెనకవైపు 3 కెమెరాల సెటప్ అందించారు. ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగాపిక్సెల్ పెరిస్కోప్ సెన్సార్‌ను కూడా అందించారు. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను ఏర్పాటుచేశారు. 4530 ఎంఏహెచ్‌ బ్యాటరీతో విడుదలైన ఈ ఫోన్.. 30W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. వైఫై 6, బ్లూటూత్ వీ5.1, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, జీపీఎస్, 4జీ ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు అందించారు.

మోటరోలా ఎడ్జ్ లైట్ లక్షణాలు
మోటరోలా ఎడ్జ్ లైట్ లగ్జరీ వెర్షన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MYUI 2.0 పై నడుస్తుంది. ఇందులో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సల్స్) OLED డిస్‌ప్లేతోపాటు 144Hz రిఫ్రెష్ రేట్ అందించారు. ఈఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC తో పనిచేయనుంది. ఇందులోకూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అందించారు. ప్రధాన కెమెరా 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను f/1.9 లెన్స్‌తో పాటు, 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌, 16 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌ని కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను అందించారు.

Also Read: Telegram Group Calling: ఇప్పుడు టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒకేసారి వెయ్యిమందితో మాట్లాడొచ్చు!

Car Care in Rain: వర్షంలో కారు అద్దంపై నీరు నిలిచిపోతోందా? ఇలా చేసి చూడండి..