మరో 20 ఏళ్లలో నక్షత్రాలు మాయం..! ఇక అసలు కనిపించవు.. కారణం ఇదే..!!

|

Jun 14, 2023 | 9:29 AM

ఇది ఇలాగే కొనసాగితే,.. తరువాత తరం పిల్లలు రాత్రిపూట ఆకాశాన్ని దాని ప్రకాశం, నక్షత్రాలను చూడలేరన్నది తీవ్రమైన సమస్యగా వారు పేర్కొన్నారు.. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈ కాంతి కాలుష్యం తక్కువని చెప్పారు.

మరో 20 ఏళ్లలో నక్షత్రాలు మాయం..! ఇక అసలు కనిపించవు.. కారణం ఇదే..!!
Stars
Follow us on

రాత్రిపూట భూమిపై ఉపయోగించే చాలా ప్రకాశవంతమైన కాంతి, లైట్లు వెలిగించటం ద్వారా సాధారణంగా వచ్చే రాత్రిని కాంతితో నింపేస్తున్నారు. దాంతో పగటిపూట నక్షత్రాలను ఎలా చూడలేమో, రాత్రిపూట కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇదిలాగే కొనసాగితే వచ్చే 20 ఏళ్లలో చాలా నక్షత్రాలు కనిపించకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న కాంతి కాలుష్యం కారణంగా ఆకాశంలోని నక్షత్రాలు 20 ఏళ్లలో కనిపించకుండా పోతాయి. కాలుష్యం కారణంగా వాటిని చూడలేకపోతున్నామని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక ఇంటర్వ్యూలో బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్త మార్టిన్ రీస్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కాంతి కాలుష్య పరిస్థితులు వేగంగా అధ్వాన్నంగా మారాయని చెప్పారు. గత కొన్నేళ్లుగా కాంతి కాలుష్యం తీవ్రంగా మారింది. 2016 నాటికి, ఖగోళ శాస్త్రవేత్తలు పాలపుంత ప్రపంచంలోని మూడింట ఒక వంతు మందికి కనిపించదని నివేదించారు. 2016 నుండి ఖగోళ శాస్త్రవేత్తలు పాలపుంత మానవాళిలో మూడవ వంతు మందికి కనిపించదని నివేదించినప్పుడు వివరించారు. పెరుగుతున్న కాంతి-ఉద్గార డయోడ్‌లు (LED), ఇతర రకాల లైటింగ్‌లు ఇప్పుడు రాత్రిపూట ఆకాశాన్ని నాటకీయంగా ప్రకాశవంతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇది ఇలాగే కొనసాగితే,.. తరువాత తరం పిల్లలు రాత్రిపూట ఆకాశాన్ని దాని ప్రకాశం, నక్షత్రాలను చూడలేరన్నది తీవ్రమైన సమస్యగా వారు పేర్కొన్నారు.. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈ కాంతి కాలుష్యం తక్కువని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..