ఆధునిక కాలంలో సాంకేతికత బాగా పెరిగిపోయింది. అన్ని రంగాల్లో దీని వినియోగం ఎక్కువైంది. గతంలో ఎంతో కష్టంగా అనిపించే పనులు నూతన సాంకేతిక విధానంతో చాలా సులువుగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ). దీని ద్వారా ఎన్నో అద్భుతాలు చేయవచ్చు. కేవలం మన దగ్గర ఉన్న ఒక్క ఫోటోతో అందమైన చిత్రాలను రూపొందించవచ్చు. వ్యక్తిగతంగా, ఉద్యోగ పరంగా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు ఏఐ టూల్స్ ను ఉపయోగించుకుందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ కోపైలట్ ప్రోను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.
మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్ పెయిడ్ వెర్షన్ కోపైలట్ ప్రో విడుదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లో భాగంగా అనేక ప్రత్యేకతలతో దీన్ని రూపొందించారు. మనదేశంతో పాటు ప్రపంచంలోని 222 దేశాల్లో విడుదలైంది. నెలకు రూ.2 వేలు చెల్లించి దీనిని ఉపయోగించుకోవచ్చు. దీని ఏఐ టూల్స్ ను ఉపయోగించి అనేక అద్భుతాలు చేయవచ్చు. పరిశీలించాలనుకునే వారు ఒక నెల ఉచిత ట్రయల్ తీసుకోవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ కోపైలట్ కు అడ్వాన్స్ వెర్షన్ గా భావించాలి.
కోపైలట్ ప్రో అనేది మైక్రోసాఫ్ట్ అధునాతన వెర్షన్. ఈ కంపెనీ కొన్ని నెలల క్రితం బింగ్ ఏఐని తీసుకువచ్చింది. దాని ద్వారా వినియోగదారులకు ఏఐ సేవలను అందించింది. ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చిన కోపైలట్ ప్రో మరిన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది. కోపైలట్ సబ్‌స్క్రైబర్లు మైక్రోసాఫ్ట్ వెబ్ యాప్ ల నుంచి దీనిని పొందవచ్చు. వారు మైక్రోసాఫ్ట్ 365ను సబ్ స్క్రిప్షన్ చేసుకోవాల్సి అవసరం లేదు.
కోపైలట్ ప్రో వెర్షన్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలోని ఏఐ టూల్స్ ను ఉపయోగించుకుని వ్యక్తిగతంగా, ఉద్యోగ పరంగా నైపుణ్యాలను పెంచుకోవచ్చు. అనేక అద్భుతమైన చిత్రాలను రూపొందించవచ్చు. వివిధ ఆర్టికల్స్ రాయవచ్చు. మన రైటింగ్ స్కిల్స్ ను మెరుగుపరుకోవచ్చు. ఇంకా అనేక రకాలుగా మనకు కోపైలట్ ప్రో వెర్షన్ ఉపయోగపడుతుంది. దేశంలోని వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ కోపైలట్ ప్రో ధరను నెలకు రూ. 2 వేలుగా నిర్ణయించారు. ఆసక్తి కలవారు డబ్బులు చెల్లించి సభ్యత్వం పొందవచ్చు. ముందుగా ఒక నెల ఉచితం ట్రయల్ అవకాశం కూడా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..