మారుతీ సుజుకీ కార్లు భారతదేశంలో మధ్యతరగతి వాహన ప్రియులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారి అభిరుచులకు తగినట్లే కంపెనీ కొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తుంటుంది. ప్రస్తుతం అంతా ఈవీ వాహనాలను అందరూ ఇష్టపడుతుండడంతో మారుతి కంపెనీ కూడా ఈవీ వాహనాల తయారీపై దృష్టి పెట్టింది. పలు నివేదికలు ప్రకారం మారుతీ కంపెనీ కంపెనీ భారతదేశంలో సొంత ఈవీ వాహనాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిసింది. కంపెనీ త్వరలో తన సొంత ఈవీ కార్ వై 88 ను రిలీజ్ చేయనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. 50 శాతం ఉత్పత్తులు ఎగుమతే లక్ష్యంగా ఈ ఈవీ వాహనాలను తయారుచేయనుంది. గుజరాత్ లోని మారుతీ సుజుకీ కంపెనీ తయారీ కేంద్రంలో ఈ ఈవీ వాహనాలను తయారు చేయనున్నారు.
ఈ కార్లు 2025 నుంచి మార్కెట్ అందుబాటులో ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనవా వేస్తున్నాయి. కేవలం మధ్యతరగతి వాహన ప్రియులను టార్గెట్ చేస్తూ ఈ కార్లను తయారు చేస్తున్నారు. ఈ కార్ డిజైన్ పరంగా తన ఐస్ కార్లకంటే చాలా బాగుందని నిపుణులు చెబుతున్నారు. వై88 లో కస్టమర్లను ఆకట్టుకునే అధునాత ఫీచర్లు ఉంటాయి. ఈ కార్ లో 48 కేడబ్ల్యూహెచ్ నుంచి 59 కేడబ్ల్యూహెచ్ మధ్య బ్యాటరీ ఉండనుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే ఏకంగా 400 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ తో వస్తుంది. ఈ కార్ 130 హెచ్ పీ నుంచి 170 హెచ్ పీ, 140 బీహెచ్ పీ వస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఈ కార్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలా రూ.13 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. విశాలమైన క్యాబిన్ స్పేస్ తో మాటు అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ తో వినియోగదారులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..