Mars: అంగారక గ్రహంపై పెద్ద సముద్రం.. ఆసక్తి రేపుతున్న కొత్త అధ్యాయనం! పూర్తి వివరాలు ఇవే..

చైనా జురాంగ్ రోవర్ చేసిన అధ్యయనం ప్రకారం, అంగారక గ్రహంపై 3.6 బిలియన్ సంవత్సరాల నాటి ఇసుక తీరాలు కనుగొనబడ్డాయి. ఇది అక్కడ ఒకప్పుడు విస్తారమైన సముద్రం ఉండేదనడానికి బలమైన ఆధారం. ఈ ఆవిష్కరణ అంగారక గ్రహంపై జీవం ఉండే అవకాశం, భవిష్యత్తులో మానవ నివాసానికి అవకాశాలను తెలుపుతుంది. గతంలో అంగారక గ్రహం భూమిలాగే ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

Mars: అంగారక గ్రహంపై పెద్ద సముద్రం.. ఆసక్తి రేపుతున్న కొత్త అధ్యాయనం! పూర్తి వివరాలు ఇవే..
Mars

Updated on: Feb 27, 2025 | 11:59 AM

ఈ సువిశాల విశ్వంలో ఒక్క భూమిపైనే కాకుండా వేరే గ్రహాలపై కూడా జీవిం ఉన్నట్లు చాలా మంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అది కనిపెట్టేందుకే అనేక మంది తమ జీవితాలను కూడా త్యాగం చేస్తున్నారు. అలాగే ఒక్క భూమిపైనే కాకుండా మన సౌరకుటుంబంలో భాగమైన ఇతర గ్రహాలపై మనిషి నివశించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అని కూడా పరిశోధనలు జరుపుతున్నారు. వాటిలో భూమికి ఉపగ్రహమైన చంద్రుడు, అంగారక గ్రహాల ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలకు కొత్త ఉత్సాహం ఇస్తూ.. అంగారక గ్రహంపై కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రం ఉన్నట్లు.. దాని నీటి జాడలు, అది ఎండిపోయిన తర్వాత కొన్ని ఏళ్లుగా ఇసుక బీచ్‌ల ఆనవాళ్లు ఉన్నట్లు తాజా అధ్యాయనాలు వెల్లడిస్తున్నాయి.

అధునాతన గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్‌తో అమర్చబడిన చైనా జురాంగ్ రోవర్ సేకరించిన సమాచారం ప్రకారం.. అంగారక గ్రహంపై దాదాపు 3.6 బిలియన్ సంవత్సరాల నాటి ఇసుక బీచ్ నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు అంగారక గ్రహం ఉత్తర మైదానంలో వ్యాపించి ఉండి, అంతరించిపోయిన సముద్రం ఉనికిని బలంగా సూచిస్తున్నాయి. ఈ విప్లవాత్మక అన్వేషణ అంగారక గ్రహం గతం గురించి కీలక సమాచారాన్ని అందిస్తుంది. అలాగే ఇక్కడ జీవం ఉండే అవకాశం ఉందనే విషయంతో పాటు, భవిష్యత్తులో మనిషి ఇక్కడ జీవించవచ్చు అనే ఆశను కూడా ఇస్తోంది. అంగారక గ్రహం ఒకప్పుడు విస్తారమైన నీటిని కలిగి ఉండేదని ఈ పరిశోధన ఇప్పటివరకు అత్యంత దృఢమైన ఆధారాలను అందిస్తుంది.

పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో భూగర్భ శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్, అధ్యయన సహ రచయిత అయిన బెంజమిన్ కార్డెనాస్ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు ఊహించిన దానికంటే గతంలో అంగారక గ్రహ వాతావరణం జీవానికి మరింత అనుకూలంగా ఉండేదని ఈ పరిశోధన సూచిస్తుంది. భూమిపై మహాసముద్రాల నుంచే జీవం ప్రారంభం అయిందని, ప్రస్తుతం అంగారక గ్రహంపై ఉన్న పరిస్థితులతో భూమికి సారూప్యత ఉండటంతో.. ఆ గ్రహంపై సూక్ష్మజీవుల జీవం మనుగడ కొనసాగించి ఉండవచ్చు. ఈ తాజా పరిశోధన ప్రకారం.. అంగారక గ్రహం మనం అనుకున్నట్లు చల్లని, ఇసుక ప్రపంచం కాదని, బహుశా భూమి లాంటి వాతావరణాన్ని గతంలో కలిగి ఉండవచ్చని అన్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.