Google Analytics: ఇంటర్‌నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి వందల సంఖ్యలో వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఇంటర్‌నెట్ వినియోగదారులు పెరగడంతో కొత్త కొత్త వెబ్‌సైట్లు వస్తున్నాయి. మరి ఏ వెబ్‌సైట్‌ను ఎక్కువగా ఎవరు చూస్తున్నారు లాంటి వివరాలు ఎలా తెలుసుకోవాలి.? ఇందుకోసమే ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్.. ‘గూగుల్ అనలిటిక్స్’ పేరుతో ఓ టూల్‌ను రూపొందించింది. ఈ టూల్ సహాయంతో యూజర్ల వివరాలు తెలుసుకోవచ్చు. అయితే సోమవారం ఈ టూల్ యూజర్లను ఒక్కసారి గందరగోళానికి గురి చేసింది. గూగుల్ అనలిటిక్స్ ఒక్కసారిగా డౌన్ కావడంతో రియల్ టైం వ్యూస్ సున్నాకు చేరుకున్నాయి.
దీంతో కొంత మంది యూజర్లు గందరగోళానికి గురయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతూ పలు పోస్టులు చేశారు. అయితే గూగుల్ ఈ విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఈ సమస్యను కేవలం కొంత మంది యూజర్లు మాత్రమే ఎదుర్కున్నారు. అసలు గూగుల్ అనలిటిక్స్ ఉపయోగమేంటనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఈ టూల్ సహాయంతో యూజర్ తమ వెబ్ సైట్‌లో ఎంత సేపు ఉంటున్నారు.? ఎలాంటి కంటెంట్‌ను చూస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీని ఆధారంగా తమ వెబ్ సైట్‌ను ఎలా మెరుగుదిద్దుకోవాలన్న ప్రణాళికలు వేసుకుంటారు. అంతేకాకుండా వెబ్ సైట్లకు వచ్చే ప్రకటనలు కూడా ఈ గూగుల్ అనలిటిక్స్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా లెక్కకడతారు.
It seems Google Analytics is down. Anyone else having issues?
— Dana Nicole | Content Marketing Writer + SEO (@dana_nic0le) October 18, 2021
Someone needs to hit the panic button at Google Analytics #analytics #down pic.twitter.com/B9VQkbxVlp
— wagner silva (@wagnerjsilva) October 18, 2021
Yes – @googleanalytics real time reports seem to be struggling right now – I am sure the team is working on it
— Barry Schwartz (@rustybrick) October 18, 2021
What’s going on @googleanalytics @Google @GoogleAds GA is down and showing everything is 0 ???
GA is Down??? #GADOWN #GooleGA #googleanalytics #down pic.twitter.com/UV9RLnFezl— Manny Farooqi (@MannyFarooqi) October 18, 2021
Also Read: Zodiac Signs: ఈ మూడు రాశుల వారు ఎప్పుడూ గట్టి పోటీ ఇస్తారు.. ఏ ఏ రాశుల వారంటే..
Custard Apple Farming: సీతాఫలం సాగుతో అధిక లాభాలు.. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం..