Mahindra: చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ త్రీ వీలర్.. ధర ఎంతంటే..?

|

Jan 28, 2022 | 1:49 PM

Mahindra: మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ గురువారం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్గోను ప్రారంభించింది. ఇది చిన్న వ్యాపారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Mahindra: చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ త్రీ వీలర్.. ధర ఎంతంటే..?
Mahindra E Alfa Cargo
Follow us on

Mahindra: మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ గురువారం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్గోను ప్రారంభించింది. ఇది చిన్న వ్యాపారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త ఎలక్ట్రిక్ 3-వీలర్ ఈ-ఆల్ఫా కార్గోను విడుదల చేసినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ-కార్ట్ విభాగంలోకి ప్రవేశించేందుకు ఈ ఎలక్ట్రిక్ వాహనం ఎంతగానో సహాయం చేస్తుంది. దీనివల్ల ఇంధనం ఆదా చేయడంతోపాటు పర్యావరణం కూడా దెబ్బతినకుండా ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ 3-వీలర్ ఈ-ఆల్ఫా కార్గో మోడల్ 310 కిలోల పేలోడ్‌తో వస్తుంది. దీని పరిధి గురించి చెప్పాలంటే.. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ. దూరం కవర్ చేయవచ్చు. శక్తి పరంగా ఈ-ఆల్ఫా కార్గో గరిష్టంగా 1.5 kW శక్తిని ఉత్పత్తి చేయగలదు. వేగం గురించి చెప్పాలంటే ఈ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ గరిష్టంగా గంటకు 25 కిమీ వేగంతో దూసుకుపోగలదు. ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జ్ చేయడం కూడా చాలా సులభం. ఆఫ్-బోర్డ్ 48V/15A ఛార్జర్‌తో మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ చేసినంత సులువుగా దీనిని ఛార్జ్ చేయవచ్చు.

చిన్న వ్యాపారం ఆదా

మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ సీఈవో సుమన్ మిశ్రా మాట్లాడుతూ.. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఈ-ఆల్ఫా కార్గో విడుదల చేస్తున్నామని తెలిపారు. డీజిల్ కార్గో త్రీ-వీలర్‌పై రూ.60,000 ఆదా చేయడంతో పాటు కార్గో విభాగంలో స్థిరమైన కాలుష్య రహిత పరిష్కారాన్ని అందించడం లక్ష్యమని తెలిపారు.

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో అనేక ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్లు, నాలుగు చక్రాల వాహనాలు విడుదలవుతున్నాయి. ఇది పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. భారతదేశంలో పెట్రోల్ పంపులతో సహా అనేక కంపెనీలు విద్యుత్ ఛార్జర్ సౌకర్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు చాలా కంపెనీలు భారీ వస్తువులను తీసుకెళ్లే ద్విచక్ర వాహనాలను కూడా అందిస్తున్నాయి.

IPL 2022 వేదిక ముంబై.. ఈ 3 గ్రౌండ్‌లలో మ్యాచ్‌లు..! ఫిబ్రవరి 20న అధికారిక ప్రకటన..

Lok Sabha: వామ్మో ఆ సీటు అస్సలే వద్దు.. లోక్‌సభలో జడుసుకున్న ఎంపీలు..?

చలికాలం ఓక్యులర్ మైగ్రేన్‌తో జాగ్రత్త.. వ్యాధి లక్షణాలు, కారణాలు తెలుసుకోండి..?