AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart TV Safety Tips: టీవీ దగ్గర దోమల బ్యాట్ వాడుతున్నారా? జాగ్రత్త! ఒక్క దెబ్బతో మీ స్మార్ట్ టీవీ ఖతం..!

Smart TV Safety Tips: చాలా మంది ఇళ్లల్లో దోమలు ఉండటం సర్వసాధారణం. ఇంట్లో, పరిసరాలు శుభ్రం లేకపోతే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి రక్షించుకునేందుకు దోమల బ్యాట్‌లను వాడుతుంటాము. అయితే టీవీ దగ్గర కూడా చాలా దోమలు ఉంటాయి. వాటిని చంపేందుకు దోమల బ్యాడ్‌ను ఉపయోగించే వారు ఇవి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

Smart TV Safety Tips: టీవీ దగ్గర దోమల బ్యాట్ వాడుతున్నారా? జాగ్రత్త! ఒక్క దెబ్బతో మీ స్మార్ట్ టీవీ ఖతం..!
Smart Tv Safety Tips
Subhash Goud
|

Updated on: May 13, 2026 | 9:35 PM

Share

Smart TV Safety Tips: నేటి కాలంలో ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. వేల నుండి లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసే ఈ టీవీల విషయంలో మనం చేసే ఒక చిన్న పొరపాటు భారీ నష్టానికి దారితీస్తుంది. ముఖ్యంగా టీవీ దగ్గర దోమలను కొట్టే ఎలక్ట్రిక్ బ్యాట్ వాడటం వల్ల మీ టీవీ శాశ్వతంగా పాడయ్యే అవకాశం ఉందని ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం LG తన వినియోగదారులను హెచ్చరించింది.

LG యూజర్ మ్యాన్యువల్ ఏం చెబుతోంది?

LG తన స్మార్ట్ టీవీల అధికారిక యూజర్ మ్యాన్యువల్‌లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. టీవీకి సమీపంలో హై-వోల్టేజ్ ఎలక్ట్రికల్ పరికరాలను వాడకూడదని కంపెనీ తెలిపింది. దీనికి ఉదాహరణగా దోమల బ్యాట్‌ను పేర్కొంది. ఈ పరికరాల వల్ల ఉత్పన్నమయ్యే హై-వోల్టేజ్ స్పార్క్ (Spark) కారణంగా టీవీ లోపల ఉండే సెన్సిటివ్ సర్క్యూట్లు దెబ్బతినే ప్రమాదం ఉందని కంపెనీ వివరించింది.

టీవీ ఎలా పాడవుతుంది?

దోమల బ్యాట్ చూడటానికి చిన్నదిగా అనిపించినా, అది పని చేసేటప్పుడు చాలా ఎక్కువ వోల్టేజ్ కరెంట్‌ను విడుదల చేస్తుంది.

ఇవి కూడా చదవండి
  1. ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్: బ్యాట్ గ్రిల్స్‌కు దోమ తగిలినప్పుడు పెద్ద శబ్దంతో కూడిన స్పార్క్ వస్తుంది. ఈ స్పార్క్ ద్వారా ‘ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్’ (Electromagnetic Pulse) వెలువడుతుంది.
  2. మదర్‌బోర్డ్ డ్యామేజ్: స్మార్ట్ టీవీల్లో ఉండే డిస్‌ప్లే ప్యానెల్, మదర్‌బోర్డులు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ విద్యుత్ తరంగాలు టీవీ సర్క్యూట్‌లోకి ప్రవేశించి స్క్రీన్ ఫ్లికర్ అవ్వడం (రెప్పలా ఆడటం), ప్యానెల్ మండిపోవడం లేదా టీవీ పూర్తిగా ఆగిపోయేలా చేస్తాయి.

టీవీ దగ్గరే ముప్పు ఎక్కువ ఎందుకు?

సాధారణంగా టీవీ ఆన్‌లో ఉన్నప్పుడు దాని చుట్టూ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి. ఒకవేళ దోమ టీవీ స్క్రీన్‌పై కూర్చున్నప్పుడు మీరు దానిని బ్యాట్‌తో కొట్టడానికి ప్రయత్నిస్తే, ఆ స్పార్క్ ప్రభావం నేరుగా డిస్‌ప్లేపై పడుతుంది. గాలి ద్వారా వ్యాపించే ఈ విద్యుత్ తరంగాలు కూడా టీవీ లోపలి భాగాలను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే టీవీకి కనీసం 2 నుండి 3 అడుగుల దూరంలో ఇటువంటి పరికరాలను వాడాలని వారు సూచిస్తున్నారు.

మీ టీవీని ఎలా కాపాడుకోవాలి?

మీ ఖరీదైన స్మార్ట్ టీవీ సురక్షితంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి:

  1. దోమలను ఇలా తోలండి: టీవీ స్క్రీన్‌పై దోమలు కూర్చుంటే బ్యాట్ వాడకండి. మైక్రోఫైబర్ క్లాత్‌తో లేదా నోటితో గాలి ఊది వాటిని తోలేయండి.
  2. ఛార్జింగ్ వద్దు: దోమల బ్యాట్‌ను టీవీ దగ్గర ప్లగ్‌లలో పెట్టి ఛార్జ్ చేయకండి.
  3. సర్జ్ ప్రొటెక్టర్: విద్యుత్ హెచ్చుతగ్గుల నుండి మదర్‌బోర్డును కాపాడటానికి మంచి స్టెబిలైజర్ లేదా సర్జ్ ప్రొటెక్టర్‌ను వాడండి.
  4. దూరంగా ఉంచండి: స్టాటిక్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ వస్తువులను టీవీకి దూరంగా ఉంచడం శ్రేయస్కరం.

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. మీరు చేసిన పొరపాటు వల్ల టీవీ పాడైతే అది ‘యూజర్ నిర్లక్ష్యం’ కిందికి వస్తుంది కాబట్టి కంపెనీలు వారంటీ కూడా ఇవ్వకపోవచ్చు. అందుకే జాగ్రత్త వహించండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us