Reliance Jio network down: సోమవారం రాత్రి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిన విషయం తెలిసిందే. మనలో చాలా మంది ఫేస్‌బుక్ సర్వర్లు డౌన్ అయిన విషయం తెలియక ఇబ్బందులు పడ్డారు. మరి కొంత మంది యూజర్లు ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదంటూ ఆయా నెట్‌వర్క్ ప్రొవైడర్లకు ఫోన్ చేశారు. తరువాత కొద్ది సేపు అయ్యాక ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ ఐనా విషయాన్ని తెలుసుకుని యూజర్లు కాస్త కుదుటపడ్డారు.
సుమారు ఏడు గంటల పాటు సేవలు నిలిచిపోవడంతో వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు భారీ నష్టం వాటిల్లింది. ఇక దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో వినియోగదారులు బుధవారం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని నిమిషాల పాటు జియో డౌన్ అయ్యింది. అయితే జియో నెట్ వర్క్ డౌన్ అయ్యిందని వినియోగదారులు ఫిర్యాదు చేశారు. జియో నెట్ వర్క్ చాలా గంటల పాటు పని చేయలేదని కథనాలు వెలవడ్డాయి. మొత్తం దేశంలో జియో సేవలకు అంతరాయం కలుగలేదు. మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జియో సర్వీస్ నిలిచిపోయింది.
దాదాపు గంటన్నర నుంచి ఈ సమస్య కొనసాగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీ సాంకేతిక బృందం శ్రమిస్తోంది. సాంకేతిక సమస్యను త్వరలోనే పరిష్కరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కాగా, జూలైలో మొబైల్ వినియోగదారుల సంఖ్య 61 లక్షలకు పెరిగింది. ఈ క్రమంలో భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారుల సంఖ్య 23 లక్షలకు పెరిగింది. ఈ సమాచారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజా డేటాలో వెల్లడించింది. ఈ పెరుగుదలతో రిలయన్స్ జియో మార్కెట్ వాటా కూడా పెరిగింది. జియో మొబైల్ కనెక్షన్లు జూలై చివరి నాటికి 34.64 మిలియన్లుగా ఉన్నాయి.
అయితే సోమవారం ఉదయం ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోవడం ఇదే తొలిసారి. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.