ప్రస్తుత రోజుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఇంట్లో కనీసం రెండు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయంటే వాటి వాడకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ, నెట్ వర్క్ విషయంలో ప్రతి ఒక్కరి ఫోన్ లో డ్యుయల్ సిమ్ నేపథ్యంలో కచ్చితంగా ఒక సిమ్ జియో వాడుతున్నారు. ఎక్కడ ఉన్నా జియో మాత్రమే 4జీ డేటా అందించడంతో వినియోగదారులంతా జియో వైపే మొగ్గు చూపుతున్నారు. అలాగే జియో నెట్ వర్క్ రాకతో భారత్ లో డేటా వినియోగం పెరిగింది. క్రమేపి జియో కూడా తన ప్రీపెయిడ్ ప్లాన్ లను అప్ డేట్ చేస్తూ వస్తుంది. మొదట్లో 1.5 జీబీ డేటా ప్లాన్ ను విరివిగా వాడిన వినియోగదారులు 2 జీబీ డేటా ప్లాన్ వైపు మొగ్గుచూపుతున్నారు.
అలాగే వినియోగదారులను తరచూ వేధించే సమస్య వ్యాలిడిటీ..అన్ని నెట్ వర్క్ లు వ్యాలిడిటీను నెల అంటే 28 రోజులకు కుదించడంతో కరెక్ట్ గా నెలాఖరుతో వ్యాలిడిటీ అయ్యిపోతుంది. దీంతో వినియోగదారులకు రిచార్జ్ కష్టాలు మొదలవుతున్నాయి. అలాగే వినియోగదారులు నెట్ వర్క్ అనవసరంగా తమ సొమ్మును తీసుకుంటున్నాయని అనుకుంటుంటారు. ఈ కష్టాలకు చెక్ పెట్టేలా జియో రూ.749 తో వినియోగదారుల ముందుకు వచ్చింది.
రూ.719 ప్లాన్ ను అప్ గ్రేడ్ చేస్తూ 5జీ సేవలు అందుబాటులో ఉన్న నగరాల్లో ఈ ప్లాన్ లోనే 5 జీ సేవలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే మిగిలిన ప్రయోజనాలన్నీ సేమ్ 749తో వచ్చే ప్లాన్ లానే ఉంటాయి. కానీ ఈ ప్లాన్ లో 5 జీ సర్వీస్ లు అందుబాటులో ఉంటాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..