పోకిరీల తిక్కకుదిర్చే ఎలక్ట్రిక్​ చెప్పులు.. కాలితో టచ్‌ చేస్తే షాక్‌తో గిలగిల.. ధర కేవలం రూ.500 మాత్రమే

|

May 30, 2023 | 12:02 PM

ఇంటి ఆడపిల్ల బయటకు వెళ్లినప్పుడు ఆమె ఇంటికి తిరిగివచ్చేదాకా ఇంట్లోని తల్లిదండ్రులకు కాస్త టెన్షనే. ప్రమాదం ఎటునుంచి పొంచి ఉంటుందో ఊహించలేం. ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిని ఎదుర్కొనేందుకు, నిస్సహాయ స్థితిలో..

పోకిరీల తిక్కకుదిర్చే ఎలక్ట్రిక్​ చెప్పులు.. కాలితో టచ్‌ చేస్తే షాక్‌తో గిలగిల.. ధర కేవలం రూ.500 మాత్రమే
Women Safety Device Slippers
Follow us on

ఇంటి ఆడపిల్ల బయటకు వెళ్లినప్పుడు ఆమె ఇంటికి తిరిగివచ్చేదాకా ఇంట్లోని తల్లిదండ్రులకు కాస్త టెన్షనే. ప్రమాదం ఎటునుంచి పొంచి ఉంటుందో ఊహించలేం. ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిని ఎదుర్కొనేందుకు, నిస్సహాయ స్థితిలో భద్రత కోసం ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఇంటర్మీడియట్‌ విద్యార్ధి వినూత్న ఆవిష్కరణ చేశాడు. కాళ్లకు వేసుకునే మామూలు చెప్పులను కరెంట్​చెప్పులుగా తయారు చేశాడు. అదీ అతి తక్కువ ధరలో వాటిని తయారు చేసి అందరినీ అబ్బురపరిచాడు.

ఝార్ఖండ్​లోని ఛత్రాకు చెందిన మంజీత్​కుమార్ ఇంటర్మీడియేట్​మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బస్సుల్లో, రోడ్ల మీద, ఆఫీసుల్లో ఎక్కడపడితే అక్కడ మహిళలను వేధించే పోకిరీల నుంచి తమనుతాము కాపాడుకోవడానికి ఉపయోగపడే ఓ పరికరాన్ని ఆ బాలుడు తయారు చేశాడు. ఆపద సమయాల్లో మహిళలకు రక్షణ కవచంలా ‘విమెన్​ సేఫ్టీ డివైజ్‌’ అనే చెప్పులను తీర్చిదిద్దాడు. మహిళలు, బాలికలు వేధింపులు ఎదురైన సమయంలో ఈ ఎలక్ట్రిక్​ చెప్పులతో వారిని తంతే కరెంట్ షాక్​ తగిలి అక్కడే కిందపడిపోతారు. కనీసం 220 నుంచి 300 వోల్ట్​ల షాక్​ వారికి తగులుతుంది. ఆ గ్యాప్‌లో బాధిత మహిళ అక్కడి నుంచి పారిపోవచ్చు. వీటిని వేసుకొని బయటకు వెళ్తే ఎటువంటి ఆపద వచ్చిన ఎదుర్కోగలమనే ధైర్యం మహిళలకు వస్తుందంటున్నాడు ఈ ఝార్ఖండ్ కుర్రాడు. నిర్భయ వంటి విషాదకర ఘటనలు మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండేందుకే దీనిని రూపొందించానని చెబుతున్నాడు.

ఈ చెప్పులను ఎలా తయారు చేశాడంటే..

సాధారణంగా మనం వేసుకునే చెప్పులనే ముడిసరుకుగా వినియోగించాడు. చెప్పుల కింది భాగంలో నాలుగు బ్యాటరీలు, స్విచ్ సహా మరికొన్ని చిన్న పరికరాలను అమర్చాడు. కేవలం అరగంట ఛార్జింగ్​పెడితే చాలు రెండు రోజుల వరకు ఈ చెప్పులను వాడుకోవచ్చు. రూ.500లకే ఈ డివైజ్‌ను తయారు చేయడం మరో విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.