Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Innovation: పర్యావరణ ప్రేమికులకు గుడ్ న్యూస్.. నీరు, గాలి, సూర్యరశ్మితోనూ వాటిని నడుపొచ్చట..!

Innovation: కొన్నేళ్ల నుంచి చూస్తేనే ఉన్నాం.. కార్లు, బైక్స్‌ను నీరు, గాలి, సూర్యరశ్మితో నడపడం. ప్రపంచంలో ఎక్కడోచోట ఎవరో ఒకరు ఇలాంటి ప్రయోగాలు చేసి చూపుతూనే ఉన్నారు.

Innovation: పర్యావరణ ప్రేమికులకు గుడ్ న్యూస్.. నీరు, గాలి, సూర్యరశ్మితోనూ వాటిని నడుపొచ్చట..!
Solar Jet
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 04, 2022 | 4:15 PM

Innovation: కొన్నేళ్ల నుంచి చూస్తేనే ఉన్నాం.. కార్లు, బైక్స్‌ను నీరు, గాలి, సూర్యరశ్మితో నడపడం. ప్రపంచంలో ఎక్కడోచోట ఎవరో ఒకరు ఇలాంటి ప్రయోగాలు చేసి చూపుతూనే ఉన్నారు. అయితే, అవి పూర్తిస్థాయిలో అభివృద్ధి కాకపోవడంతో మార్కెటింగ్ చేసే స్థాయికి రావడం లేదు. దాంతో అవన్నీ చిన్న చిన్న గల్లీ ప్రయోగాలుగానే మిగిలిపోతున్నాయి. తాజాగా కారు, బైక్ వంటివే కాకుండా.. విమానాలను సైతం నీరు, గాలి, సూర్యరశ్మితో నడుపొచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుండగా.. శాస్త్రవేత్తలు సాధ్యమే అంటున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి ప్రయోగాలు కూడా జరుగుతున్నాయని చెబుతున్నారు. అవును మీరు చదివింది నిజంగా నిజం.

సాధారణంగా విమానాలు నడిచేందుకు ఎయిర్‌ ఆవియేషన్‌ ప్యూయెల్‌ అవసరం. విమానాలను నడిపేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈ ఇంధనం ఎక్కువగా ముడి చమురు నుంచి తీసిన కిరోసిన్‌ ఆధారంగా తయారు చేస్తారు. విమానాలను నడిపించేందుకు అవసరమయ్యే ఈ ద్రవ హైడ్రోకార్బన్ ఇంధనం ద్వారా విడుదలయ్యే కాలుష్యం కాస్త అధికంగానే ఉంటుంది. వాతావరణ మార్పులకు కారణమవుతున్న గ్లోబల్ ఆంత్రోపోజెనిక్ ఉద్గారాలలో దాదాపు 5 శాతం వాటా విమానయాన రంగందేనని ఒక అంచనా. ఈ నేపథ్యంలోనే దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అనే దిశగా జరుగుతున్న పరిశోధనలు పురోగతిని సాధిస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్నాయి.

జ్యూరిచ్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఆల్డో స్టెయిన్‌ఫెల్డ్ రూపొందించిన ఒక పరిశోధనా పత్రం విమానాల్లో ఉపయోగించే ప్రస్తుత ఇంధనానికి ప్రత్యామ్నాయాలను సూచించింది. యూరోపియిన్‌ యూనియన్‌ ‘సన్‌ టూ లిక్విడ్‌’ ప్రాజెక్టులో భాగంగా స్టెయిన్‌ఫెల్డ్ బృందం సౌరశక్తిని ఉపయోగించి ఇంధనాలను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ది చేసింది. ఈ విధానంలో సూర్యరశ్మి, నీరు, కార్బన్‌ డయాక్సైడ్‌లను వాడుకొని ప్రత్యేక ఇంధనాన్ని రూపొందిస్తారు. ఇది ఉద్గారాలను చాలా వరకూ తగ్గిస్తుందని వీరు చెబుతున్నారు. ఈ బృందం 2017 నుంచి ప్రారంభించిన పరిశోధనలు ఒక దశకు చేరింది. స్పెయిన్‌లోని IMDEA ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్‌లో సౌర ఇంధన ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ పరిశోధనలు పూర్తి స్థాయిలో ఫలిస్తే విమానయాన రంగంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. మరి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూద్దాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..