చివరి నిమిషంలో చంద్రుడిపై కూలిన ఇజ్రాయెల్‌ స్పేస్‌క్రాఫ్ట్

చిన్న దేశమైన ఇజ్రాయెల్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మూన్‌ మిషన్‌’ విఫలమైంది. చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు పంపించిన ‘బేరెషీట్‌’ అంతరిక్ష నౌకలో చివరి దశలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఇది చంద్రుడి ఉపరితలంపై మరికాసేపట్లో దిగుతుందనగా కుప్పకూలింది. ఈ ప్రయోగం కోసం ఇజ్రాయెల్ సుమారు 100 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేసింది. ప్రైవేట్‌ స్పేస్‌ స్టార్టప్ సంస్థ ‘స్పేస్‌ఐఎల్‌’, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా ఈ అంతరిక్ష నౌకను నిర్మించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22న […]

చివరి నిమిషంలో చంద్రుడిపై కూలిన ఇజ్రాయెల్‌ స్పేస్‌క్రాఫ్ట్
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2019 | 6:38 PM

చిన్న దేశమైన ఇజ్రాయెల్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మూన్‌ మిషన్‌’ విఫలమైంది. చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు పంపించిన ‘బేరెషీట్‌’ అంతరిక్ష నౌకలో చివరి దశలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఇది చంద్రుడి ఉపరితలంపై మరికాసేపట్లో దిగుతుందనగా కుప్పకూలింది.

ఈ ప్రయోగం కోసం ఇజ్రాయెల్ సుమారు 100 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేసింది. ప్రైవేట్‌ స్పేస్‌ స్టార్టప్ సంస్థ ‘స్పేస్‌ఐఎల్‌’, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా ఈ అంతరిక్ష నౌకను నిర్మించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ‘ఫాల్కన్‌ 9’ రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగించారు. సుమారు 7 వారాల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన బేరెషీట్‌ స్పేస్‌క్రాఫ్ట్.. గతవారమే చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించింది. కక్ష్యలను పెంచడం ద్వారా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను చంద్రుడి సమీపంలోకి చేర్చారు. గురువారం (ఏప్రిల్ 11) చంద్రునిపై లాండింగ్‌ సమయంలో రోబోటిక్‌ లాండర్‌లోని ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో పాటు కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా దెబ్బతినడంతో ఈ ప్రయోగం విఫలమైంది.

ఇప్పటివరకూ చంద్రుడిపై అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే సురక్షితంగా లాండర్లను దించగలిగాయి. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనకు ఉద్దేశించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘చంద్రయాన్-2’ మిషన్‌ను ఈ ఏడాది జులైలో చేపట్టనున్నారు.