Stress in Plants: మొక్కే కదా అని తీసిపారేయకండి.. దానికీ ఒత్తిడి ఉంటుందట తెలుసా..?

|

Jun 23, 2021 | 9:28 PM

Stress in Plants: మనం మనకే మనసు ఉంటుంది అనుకుంటాం. మనపైనే తీవ్రమైన ఒత్తిడి ఉంది అని బాధపదిపోతాం. కానీ, మొక్కలూ తీవ్రమైన ఒత్తిడిని అనుభావిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Stress in Plants: మొక్కే కదా అని తీసిపారేయకండి.. దానికీ ఒత్తిడి ఉంటుందట తెలుసా..?
Stress In Plants
Follow us on

Stress in Plants: మనం మనకే మనసు ఉంటుంది అనుకుంటాం. మనపైనే తీవ్రమైన ఒత్తిడి ఉంది అని బాధపదిపోతాం. కానీ, మొక్కలూ తీవ్రమైన ఒత్తిడిని అనుభావిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కలకూ మనలాగే చాలా భావాలు ఉంటాయట.. కాకపొతే మనకే అర్థం కాదని వారంటున్నారు. ఇలా మొక్కలు ఒత్తిడిలో ఉన్నాయని గమించించిన వారు ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు. వారు బంగాళాదుంప మొక్కలో ఒత్తిడి (స్ట్రెస్) కారణంగా మార్పులను గమనించారు. ఈ పరిశోధన వ్య్వయసాయానికి బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే, మొక్కలు ఎటువంటి బాధ అనుభావిస్తాయో వాటి హావభావాల ద్వారా తెలుసుకోవడం కష్టం. ఫలితంగా అవి మనకు తెలీకుండానే దెబ్బతింటాయి. వాటిని మనం కాపడుకునే ఛాన్స్ దొరకదు. ఇప్పుడు ఈ పరిశోధన కారణంగా మొక్కలకు ఎదురయ్యే ఒత్తిడిని ముందుగానే పసిగట్టి.. దానికి అనుగుణంగా మనం ఏది కావాలో చేస్తే వాటిని కాపాడుకోవడం సులభం అవుతుంది అంటున్నారు. ఒక్క ఒత్తిడి అనే కాదు.. భవిష్యత్ లో మొక్కకు కావలసిన అవసరాలను (అంటే, నీరు..సూర్యరశ్మిఇలాంటివి) ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు. ఈ పరిశోధనలు చేసింది జెరూసలేం యొక్క హిబ్రూ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం. వీరు బంగాల దుంప మొక్కపై పరిశోధనలు చేసి.. దానిలో మార్పులు చేశారు. ఇప్పడు అది ఒత్తడికి గురైనపుడు కాంతిని విడుదల చేస్తుందని చెబుతున్నారు.

చెట్లు ఎప్పుడు ఒత్తిడికి లోనవుతాయి?

శాస్త్రవేత్తల ప్రకారం, చెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటాయి. వాటికి నీరు లేనప్పుడు, చాలా చల్లగా ఉన్నప్పుడు, సూర్యరశ్మిని పొందలేనపుడు లేదా బలమైన సూర్యరశ్మిని అనుభావిస్తునపుడు అవి ఒత్తిడికి లోనవుతాయి. మానవులు సాధారణంగా వాటి ఒత్తిడి లక్షణాలను అర్థం చేసుకోలేరు. అందువల్ల, ఈ పరిస్థితులను నిరంతరం ఎదుర్కోవడం ద్వారా, అవి మరణించడం ప్రారంభిస్తాయి. మొక్కల పరిశోధకుడు డాక్టర్ షిలో రోసెన్‌వాస్సర్, అతని బృందం బంగాళాదుంప మొక్కను జన్యుపరంగా మార్పు చేసి ఒత్తిడిని అర్థం చేసుకున్నారు. మొక్క యొక్క క్లోరోప్లాస్ట్‌లో కొత్త జన్యువును చేర్చారు. మొక్క ఒత్తిడికి గురైనప్పుడు, కొత్త జన్యువు దానిలో ఒక నిర్దిష్ట ప్రోటీన్ మొత్తాన్ని పెంచుతుంది, ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ప్రోటీన్ మొత్తం పెరిగినప్పుడు, మొక్క కాంతిని చెదరగొడుతుంది. అది ఒత్తిడికి లోనవుతుంది. శాస్త్రవేత్తలు ఈ మొక్కలను కెమెరాతో అనుసంధానించారు. మొక్క నీరు లేకపోవడం, బలమైన సూర్యరశ్మిని ఎదుర్కొన్నప్పుడల్లా అది కాంతిని చెదరగొడుతుంది.

ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగానికి బంగాళాదుంపను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇది ఇక్కడ ప్రధాన పంట. ప్రపంచవ్యాప్తంగా బంగాళాదుంపల వార్షిక పంటలో 40 శాతం ఇజ్రాయెల్ ఎగుమతి చేస్తుంది. బయోసెన్సర్ల సహాయంతో, బంగాళాదుంప పంట దెబ్బతినకముందే దానిని నియంత్రించవచ్చు. దాని సాగు పరిధిని పెంచవచ్చు. అలాగే, ఈ మొక్కలను వాతావరణ మార్పులతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

మొక్కల ఒత్తిడిని కెమెరా నుండే చూడవచ్చని పరిశోధకుడు డాక్టర్ షిలో చెప్పారు, మొక్కల రంగును మార్చే ప్రక్రియను కళ్ళతో చూడలేము. అందువల్ల ఇది ఒక ప్రత్యేకమైన కెమెరాతో జతచేశారు. దాని సహాయంతో ఇది చూడవచ్చు. ఇప్పుడు మేం బయోసెన్సర్ల సహాయంతో మొక్కల సంకేతాలను అర్థం చేసుకోగలుగుతున్నాము. ఇవి అధిక ఉష్ణోగ్రతలతో పోరాడుతున్నాయా, కరువు పరిస్థితి, సూర్యరశ్మిని గుర్తించవచ్చు అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: Electric Vehicles: మన దేశంలో రానున్న మూడేళ్ళ కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 26 శాతం పెరగొచ్చు..ఆటో నిపుణుల అంచనా!

NASA on Venus: శుక్రగ్రహం పై భూమి పొరల కదలికల వంటి కదలికలను గుర్తించిన నాసా పరిశోధనలు..