Iqoo neo 7: అధునాతన ఫీచర్లతో ఐకూ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.?

|

Oct 23, 2022 | 5:08 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ సంస్థ ఐకూ తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐకూ నియో 7 పేరుతో చైనాలో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ఫోన్‌ ధర ఎంత.? ఇందులో ఉన్న ఫీచర్ల..

Iqoo neo 7: అధునాతన ఫీచర్లతో ఐకూ నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.?
Iqoo Neo 7
Follow us on

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ సంస్థ ఐకూ తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐకూ నియో 7 పేరుతో చైనాలో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ఫోన్‌ ధర ఎంత.? ఇందులో ఉన్న ఫీచర్లపై ఓ లుక్కేయండి.. ఐకూ నియో 7లో 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ + E5 అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. గేమింగ్‌ లవర్స్‌ కోసం ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా డిస్‌ప్లే చిప్ ప్రో+ను అందించారు.

ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తే ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమన్సిటీ 9000+ ప్రాసెసర్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కు సపోర్ట్ చేసే కెమెరా ఈ ఫోన్‌ ప్రత్యేకగా చెప్పొచ్చు. 120 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌ + 1280 స్టోరేజ్‌ ఫోన్‌ ధర చైనాలో 2699 యువాన్లుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 30,800గా ఉండనుంది. ఇక 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర 2,799 యువాన్లుకాగా ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. 32,000గా ఉండనుంది. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ఇండియన్‌ కరెన్సీలో రూ.34,000, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.37,700గా ఉండనుంది. అయితే ఇండియాలో ఇదే ధరలో అందుబాటులో ఉంటుందా.? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..