iPhone 13: ఐఫోన్ 13 ధరలు భారీగా పెరిగే అవకాశం.. విడుదలకు ముందే షాకిస్తున్న ఆపిల్.. ఎందుకో తెలుసా?

ఐఫోన్ 13 సిరీస్‌ ఫోన్లలో ఉపయోగించే చిప్ ఉత్పత్తి వ్యయాలను 20 శాతం పెంచేందుకు టీఎస్ఎంసీ యోచిస్తోందంట. దీంతో వచ్చే నెలలో విడుదల కాబోయే ఈ ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

iPhone 13: ఐఫోన్ 13 ధరలు భారీగా పెరిగే అవకాశం.. విడుదలకు ముందే షాకిస్తున్న ఆపిల్.. ఎందుకో తెలుసా?
Iphone13
Follow us

|

Updated on: Aug 27, 2021 | 9:35 AM

iPhone 13: ఐఫోన్ 13 సిరీస్ ధరలు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండొచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కొత్త నివేదిక మేరకు చిప్ తయారీ వ్యయాల పెరుగుదలతో ఈ ప్రభావం ఫోన్ల ధరలపై పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆపిల్ ఐఫోన్ 13 శ్రేణిలో ధరలను పెంచాలని ఆపిల్ చూస్తున్నట్లు తెలిసింది. తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC), ఆపిల్ ఫోన్లకు చిప్‌లను సరఫరా చేస్తోంది. ఈ చిప్ ఉత్పత్తి ఖర్చులను పెంచేందుకు టీఎస్ఎంసీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇది ఆపిల్‌తో సహా టీఎస్ఎంసీ కస్టమర్‌లపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. జనవరి 2022 నుంచి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ పెర్కొంది. దీంతో తక్కువ ధరల్లో వస్తాయనుకున్న ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్‌ ఫోన్లు.. ఈ వార్తతో కొంత నిరాశనే కలగనుంది.

డిజిటైమ్స్ నివేదిక ప్రకారం.. టీఎస్ఎంసీ చిప్ ఉత్పత్తి వ్యయంపై 20 శాతం పెంచనుంది. ఈ పెరుగుదల గురించి టీఎస్ఎంసీ ఇప్పటికే తన వినియోగదారులకు తెలియజేసింది. ఇది జనవరి 2022 నుంచి అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ‘అడ్వాన్స్, మెచ్యూర్ ప్రాసెస్ టెక్నాలజీస్’ కోసం ఉత్పత్తి వ్యయం పెంచనున్నట్లు టీఎస్ఎంసీ సంస్థ పెర్కొంది. డిసెంబర్ నుంచి సరఫరా చేసే చిప్‌ల ధరలను కూడా సర్దబాటు చేసే అవకాశం ఉందని సంస్థ వెల్లడించింది. టీఎస్ఎంసీ అతిపెద్ద క్లయింట్లలో ఆపిల్ సంస్థ ఒకటి. టీఎస్ఎంసీ కంపెనీ మొత్తం ఆదాయంలో 20 శాతానికి పైగా చిప్స్‌ నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్ఎంసీ అధునాతన సబ్ -7 ఎన్ఎమ్ ప్రాసెస్ టెక్నాలజీస్ వాడుతుండడంతో ఆపిల్ ఐఫోన్ 13 ధరలలో 3-5 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది.

చిప్ ఉత్పత్తి వ్యయం ప్రభావాన్ని తగ్గించడానికి ఆపిల్ ముందుగానే ఐఫోన్ 13 సిరీస్ ధరను పెంచాలని చూస్తున్నట్లు తెలిసింది. యాపిల్ ఐఫోన్ ధరలను ఎండ్-మార్కెట్ కస్టమర్‌లకు అందించాలని చూస్తోంది. ఇది ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు కూడా ఇదే బాటలో నడవనున్నట్లు సమాచారం. ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ 17 న విడుదల కానున్నాయి. అలాగే సెప్టెంబర్ 30 న కొత్త ఎయిర్‌పాడ్స్ అండుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 13 మోడల్స్ పాత మోడళ్ల కంటే మెరుగైన బ్యాటరీని అందిస్తాయని సమాచారం. అలాగే ఐఫోన్ 13 శ్రేణి కెమెరాలలో భారీగా మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. టాప్-ఎండ్ మోడల్స్ వీడియోలు, పోర్ట్రెయిట్ మోడ్ వీడియోలలో పలు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Apple iPhone 13: విడుదల కాకముందే అభిమానుల్లో కాక రేపుతున్న ఆపిల్ ఐఫోన్ 13.. దీని స్పెషాలిటీ తెలిస్తే మీరూ ఆ లిస్ట్‌లో చేరిపోతారు!

ఈ 5 కార్లు ఇండియాలోనే టాప్ క్లాస్ ఫీచర్లతో రాబోతున్నాయి..! మీరు కొనాలంటే ఒక్కసారి వీటిపై ఓ లుక్కేయండి..

youtube videos: పది లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్‌.. వీటిలో దానికి సంబంధించినవే ఎక్కువ.

ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!