Gmail Update: జీమెయిల్‌లో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. ఒకేఒక్క క్లిక్‌తో 50 మెయిల్స్‌ ఫసక్‌…

ముఖ్యంగా జీ మెయిల్స్‌ ఉత్తర ప్రత్యుత్తరాల్లో కీలక మార్పులు తీసుకువచ్చాయి. గతంలో ఏదైనా అఫిషియల్‌ సమాచార బదిలీకి పోస్టాఫీస్‌ సేవలను ఉపయోగించుకునే వారు. ఇది డబ్బుతో పాటు సమయాన్ని వృథా చేస్తుంది. దీంతో సమాచార బదిలీకు మెయిల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అలాగే మన స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌కు సంబంధించిన యాప్స్‌ పని చేయాలన్నా జీమెయిల్‌ అనేది తప్పనిసరిగా మారింది. గతంలో వ్యాపార ప్రకటనలకు వివిధ మార్గాల ద్వారా చేసేవారు. అయితే క్రమేపి వ్యాపార ప్రకటనలతో పాటు సమాచారాన్ని కూడా మెయిల్స్‌ ద్వారా పంపుతున్నారు.

Gmail Update: జీమెయిల్‌లో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. ఒకేఒక్క క్లిక్‌తో 50 మెయిల్స్‌ ఫసక్‌…
Gmail
Follow us
Srinu

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 27, 2023 | 10:01 PM

ప్రపంచంలో టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రతి చిన్న అవసరానికి స్మార్ట్‌ఫోన్‌ తప్పనిసరైంది. సమస్త ప్రపంచంలో అరచేతిలోకి వచ్చి చేరింది. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌లో వినియోగించే ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌ను గూగుల్‌ అందిస్తుంది. అందువల్ల​ మన ఫోన్స్‌లో గూగుల్‌కు సంబంధించి కొన్ని ప్రీ ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌ వస్తాయి. ముఖ్యంగా జీ మెయిల్స్‌ ఉత్తర ప్రత్యుత్తరాల్లో కీలక మార్పులు తీసుకువచ్చాయి. గతంలో ఏదైనా అఫిషియల్‌ సమాచార బదిలీకి పోస్టాఫీస్‌ సేవలను ఉపయోగించుకునే వారు. ఇది డబ్బుతో పాటు సమయాన్ని వృథా చేస్తుంది. దీంతో సమాచార బదిలీకు మెయిల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అలాగే మన స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌కు సంబంధించిన యాప్స్‌ పని చేయాలన్నా జీమెయిల్‌ అనేది తప్పనిసరిగా మారింది. గతంలో వ్యాపార ప్రకటనలకు వివిధ మార్గాల ద్వారా చేసేవారు. అయితే క్రమేపి వ్యాపార ప్రకటనలతో పాటు సమాచారాన్ని కూడా మెయిల్స్‌ ద్వారా పంపుతున్నారు. అయితే మన జీమెయిల్‌ ఇలాంటి అనవసరమైన మెయిల్స్‌ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన స్టోరేజీను సగంపైగా అనవసర మెయిల్స్‌ ఉంటున్నాయి. వీటిని డిలీట్‌ చేయడం పెద్ద ప్రహసనంలా మారింది. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెడుతూ గూగుల్‌ ఓ మంచి అప్‌డేట్‌ ఇచ్చింది. ఆ నయా అప్‌డేట్‌ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

గూగుల్‌ తన జీమెయిల్‌ యాప్ వినియోగదారులకు పాత, అవాంఛిత ఈమెయిల్‌లను తొలగించడానికి ఓ మంచి అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ తాజా ఫీచర్‌ కేవలం ఒకే క్లిక్‌తో ఒకేసారి 50 ఈ-మెయిల్‌లను ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ తాజా వెర్షన్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ 13 లేదా ఆండ్రాయిడ్‌14 ద్వారా పని చేస్తున్న సామ్‌సంగ్‌ గెలాక్సీ, గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరిన్ని పరికరాలకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ తాజా అప్‌డేట్‌యాప్‌లోని మొదటి 50 ఇమెయిల్‌లను తనిఖీ చేస్తుంది. అవసరమైతే నిర్దిష్ట ఇమెయిల్‌లను అన్‌చెక్ చేసే అవకాశం కూడా వినియోగదారులకు ఉంటుంది. డెస్క్‌టాప్ వెర్షన్‌లో కొంతకాలంగా ఇదే ఫీచర్ అందుబాటులో ఉంది. గూగుల్‌ కేవలం 15 జీబీ ఉచిత నిల్వను అందించే గూగుల్‌ ఖాతా ఉచిత శ్రేణిలో ఉన్న వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిల్వ నిండినప్పుడు పాత ఇమెయిల్‌లను తొలగించడం ద్వారా వినియోగదారులు కొత్త వాటిని ఉంచడానికి నిల్వ స్థలాన్ని ఖాళీ చేయవచ్చు. ఇటీవల గూగుల్‌ ఫోటోల కోసం అపరిమిత నిల్వను అందించడం నిలిపివేసింది. గూగుల్‌ ఫోటోల్లో వారి మల్టీమీడియాను బ్యాకప్ చేసే వినియోగదారులు వారి 15 జీబీ డేటా పరిమితిని త్వరగా వినియోగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..