
సోషల్ మీడియా ప్లాట్ ఫారంలలో ఇన్‌స్టాగ్రామ్‌కు మంచి డిమాండ్ ఉంది. పోస్టింగ్స్, రీల్స్, స్టోరీస్‌తోపాటు చాటింగ్‌కి కూడా దీనిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఇన్‌స్టాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇన్‌స్టాగ్రామ్ కూడా కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతుంటుంది. ఈ క్రమంలో మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. వాస్తవానికి చాలా మెసేజింగ్ యాప్స్‌లో ఇప్పటికే ఉన్నదే ఈ ఫీచర్. అదేంటంటే మనం ఇన్‌స్టాలో పంపిన మెసేజ్‌ను రీ ఎడిట్ చేసుకొనే వెసులుబాటు ఇన్‌బిల్ట్‌గా వచ్చింది. సాధారణంగా సోషల్ మీడియాలో ఎవరికైనా మెసేజ్ పంపిస్తే..దానిలో ఏదైనా అక్షరం, లేదా పదం తప్పుగా టైప్ అయ్యిందనుకోండి.. అలాగే వెళ్లపోతే దానిని తిరిగి ఎడిట్ చేసుకోవడం కుదరదు. అయితే ఇన్‌స్టాగ్రామ్(డీఎం) ద్వారా పంపిన మెసేజ్ ను ఎడిట్ చేసుకొనే అవకాశం ఉంటుంది. అంతేకాక మీరు ఎడిట్ చేశారు అన్న విషయం కూడా అవతలి వ్యక్తికి తెలియకుండా దానిని చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కొత్త మెసేజ్ ఎడిట్ ఫీచర్‌గా అందుబాటులో ఉంది. అయితే ఇది రెండు ఫీచర్లను కలపడం ద్వారా సాధ్యమవుతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే.. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలంటే ఈ స్టెప్ బై స్టెప్ గైడ్ ను వినియోగించండి..
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..