Infinix GT 20 Pro: భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌.. బడ్జెట్‌లో సూపర్ ఫీచర్స్‌

ఇన్‌ఫినిక్స్ జీటీ 20 ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 8200 అల్టిమేట్‌ ఎస్వోసీ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదేనంటూ కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే దీనిని గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను మెబా బ్లూ, మెచా ఆరెంజ్‌, మెచా సిల్వర్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు..

Infinix GT 20 Pro: భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌.. బడ్జెట్‌లో సూపర్ ఫీచర్స్‌
Infinix Gt 20 Pro

Updated on: May 23, 2024 | 8:00 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ కంపెనీలు భారత మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్ మంగళవారం భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇన్‌ఫినిక్స్‌ జీటీ 20 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్‌ఫినిక్స్ జీటీ 20 ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 8200 అల్టిమేట్‌ ఎస్వోసీ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదేనంటూ కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే దీనిని గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను మెబా బ్లూ, మెచా ఆరెంజ్‌, మెచా సిల్వర్‌ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఈ నెల 28వ తేదీ నుంచి ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

ఇక ఈ ఫోన్‌ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 22,999కాగా.. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 24,999గా నిర్ణయించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 1080×2436 పిక్సెల్స్ రిజల్యూషన్‌, ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌తో రెండేళ్లు ఆండ్రాయిడ్ అప్ డేట్, మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తున్నారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన శాంసంగ్ హెచ్ఎం6 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎన్ఎఫ్సీ, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఓటీజీ, బ్లూటూత్, వై-ఫై 802.11 వంటి ఫీచర్లను అందించారు. ఇక బ్యాటరీ పరంగా చూస్తే ఇందులో 45 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..