Infinix Laptop: సూపర్ డిజైన్‌తో ఇన్‌ఫినిక్స్ ల్యాప్‌టాప్.. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు..

|

Feb 21, 2023 | 3:30 PM

ఇన్‌ఫినిక్స్ ఇప్పటికే కొన్ని రకాల ల్యాప్‌టాప్‌లను రిలీజ్ చేసింది. ప్రస్తుతం మరో కొత్త ల్యాప్‌టాప్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇన్‌బుక్ వై 1 ప్లస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ ల్యాప్‌టాప్‌లో అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి.

Infinix Laptop: సూపర్ డిజైన్‌తో ఇన్‌ఫినిక్స్ ల్యాప్‌టాప్.. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు..
Infinix Inbook Y1 Plus
Follow us on

ప్రస్తుతం మొబైల్ కంపెనీలు కొత్తగా ల్యాప్‌టాప్ మార్కెట్‌పై దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఎంఐ, రెడ్‌మీ, రియల్ మీ కంపెనీలు ఇప్పటికే కొత్త ల్యాప్‌టాప్‌లతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. వాటికి పోటీగా నిలుస్తున్న ఇన్‌ఫినిక్స్ ఇప్పటికే కొన్ని రకాల ల్యాప్‌టాప్‌లను రిలీజ్ చేసింది. ప్రస్తుతం మరో కొత్త ల్యాప్‌టాప్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇన్‌బుక్ వై 1 ప్లస్ పేరుతో రిలీజ్ చేసిన ఈ ల్యాప్‌టాప్‌లో అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉంటున్నాయి. 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 10 జెన్, ఐ3 ప్రాసెసర్‌తో (8 జీబీ+ 256 జీబీ), (8 జీబీ+ 512 జీబీ) రెండు వేరియంట్లల్లో వస్తుంది. 1.76 కేజీల బరువుతో అల్యూమీనియం అల్లాయ్ ముగింపును కలిగి ఉంటుంది. అలాగే 18.2 ఎంఎం సైజ్‌తో వస్తుంది. ఈ ల్యాప్ టాప్ ధర (8 జీబీ+ 256 జీబీ) వెర్షన్ అయితే రూ.29,999 గా ఉంటే (8 జీబీ+ 512 జీబీ) వెర్షన్ రూ.32,990 గా ఉంది. అలాగే ఈ ల్యాప్ టాప్ ఫిబ్రవరి 24 నుంచి ఫ్లిప్ కార్ట్‌లో కొనుగోలు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

ఇన్‌ఫినిక్స్ ఇన్ బుక్ వై1 ప్లస్ స్పెసిఫికేషన్లు ఇవే

  • 15.6 అంగుళాల (1920×1080 పిక్సెల్స్)  పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లే, 26 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
  • 1.2 జీహెచ్‌జెడ్ 10వ తరం ఐ 3 యూహెచ్‌డీ ప్రాసెసర్
  • (8 జీబీ+ 256 జీబీ), (8 జీబీ+ 512 జీబీ) రెండు వేరియంట్లల్లో లభ్యం
  • విండోస్ 11 హోమ్, 2 ఎంపీ ఫుల్ హెచ్‌డీ వెబ్ క్యామ్
  • 1.76 కేజీల బరువుతో, యూఎస్‌బీ స్లాట్స్‌తో పాటు 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్‌తో డీటీఎస్ ఆడియో ప్రాసెసింగ్ సిస్టమ్

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..