కేంద్రానికి, ట్విట్టర్ కు మధ్య పోరు..ప్రత్యామ్నాయం ఎదగడానికి ‘కూ’ ప్రయత్నాలు.. ఇప్పటికే నైజీరియాలో అందుబాటులో ఉన్నట్లు ప్రకటన

|

Jun 06, 2021 | 2:54 PM

India's Koo to replace Twitter : భారత్ లో సోషల్ మీడియా నిబంధనలు కఠినతరం చేయడంతో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై కత్తి వేలాడుతోంది. తమ కొత్త నియమావళిని..

కేంద్రానికి, ట్విట్టర్ కు మధ్య పోరు..ప్రత్యామ్నాయం ఎదగడానికి కూ ప్రయత్నాలు.. ఇప్పటికే నైజీరియాలో అందుబాటులో ఉన్నట్లు ప్రకటన
Koo
Follow us on

India’s Koo to replace Twitter : భారత్ లో సోషల్ మీడియా నిబంధనలు కఠినతరం చేయడంతో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై కత్తి వేలాడుతోంది. తమ కొత్త నియమావళిని అంగీకరించాల్సిందేనని ట్విట్టర్ కు కేంద్రం చివరి అవకాశం ఇచ్చింది. తాజాగా ఆఫ్రికా దేశం నైజీరియా ట్విట్టర్ ను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భారత సోషల్ నెట్వర్కింగ్ సైట్ ‘కూ’ మరోసారి తెరపైకి వచ్చింది. ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు తీవ్రంగా కృషిచేస్తున్న ‘కూ’… తాము ఇప్పుడు నైజీరియాలో అందుబాటులో ఉన్నామని ప్రకటించింది.

ట్విట్టర్ నిషేధంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసేందుకు ‘కూ’ ఉత్సాహంగా ఉంది. నైజీరియాలో తమ రంగప్రవేశంపై ‘కూ’ సీఈవో క్లారిటీ ఇచ్చారు. స్థానిక భాషల్లోనూ సేవలు అందించాలన్నది తమ ప్రయత్నమని, ఈ క్రమంలో నైజీరియాలోనూ ‘కూ’ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. నైజీరియాలో ఇతర మైక్రోబ్లాగింగ్ సైట్లకు ఓ అవకాశం వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. ‘కూ’ యాప్ లో నైజీరియా స్థానిక భాషలకు కూడా స్థానం కల్పిస్తామని ఆ సంస్థ సీఈవో తెలిపారు.

ట్విట్టర్ తరహాలోనే భావవ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇచ్చే సామాజిక మాధ్యమంగా ‘కూ’ గతేడాది ప్రారంభమైంది. ఇప్పుడిది తెలుగు, బెంగాలీ, హిందీ వంటి అనేక భాషల్లో అందుబాటులో ఉంది. ‘కూ’ కి ఇప్పటివరకు 60 లక్షల మంది యూజర్లు ఉన్నారు. దేశీయ మార్కుతో ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలను కోరుతోంది. నిబంధనల విషయంలో కొంతకాలంగా కేంద్రానికి, ట్విట్టర్ కు మధ్య పోరు నడుస్తుంది. ఈ క్రమంలో ఒకవేళ కేంద్రం ట్విట్టర్ ను నిలిపివేస్తే ‘కూ’ వంటి సైట్లకు ప్రజాదరణ పెరుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాగా, ‘కూ’ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ నియమ నిబంధనలను తాము పాటిస్తున్నామంటూ సంబంధిత వివరాలను సమర్పించింది.

Also Read: ఓ అధికారిని వినూత్న ఆలోచన. ప్రతిఒక్కరికి కరోనా టీకా కోసం గ్రామాలను దత్తత తీసుకుంటున్న పెద్దలు ఎక్కడంటే..!