WhatsApp: యూజర్ల భద్రతకే మొదటి ప్రాధాన్యత.. కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించిన వాట్సాప్‌

|

May 25, 2021 | 3:13 PM

WhatsApp: కస్టమర్ల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ఇటీవల వాట్సాప్‌ తీసుకువచ్చిన కొత్త పాలసీ విధానంపై కేంద్ర సర్కార్‌ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ..

WhatsApp: యూజర్ల భద్రతకే మొదటి ప్రాధాన్యత.. కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించిన వాట్సాప్‌
Follow us on

WhatsApp: కస్టమర్ల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ఇటీవల వాట్సాప్‌ తీసుకువచ్చిన కొత్త పాలసీ విధానంపై కేంద్ర సర్కార్‌ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాట్సాప్‌ కంపెనీ స్పందించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. భారత ప్రభుత్వం పంపిన లేఖపై స్పందించామని, వినియోగదారుల గోప్యతే మాకు ఎంతో ముఖ్యమని హామీ ఇచ్చామని పేర్కొంది. నూతన పాలసీతో వినియోగదారులు వ్యక్తిగత సందేశాల గోప్యతకు భంగం కలుగదని, రాబోయే రోజుల్లో వాట్సాప్‌ కార్యాచరణలో ఏ మార్పులు ఉండవని స్పష్టం చేసింది.

అయితే, కస్టమర్లకు ప్రైవసీ పాలసీపై అప్‌డేట్‌ను ఇస్తూనే ఉంటామని పేర్కొంది. పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ చట్టం అమల్లోకి వచ్చేంత వరకు వాట్సాప్‌ అకౌంట్లు, ఫీచర్లలో ఎలాంటి మార్పు ఉండవని స్పష్టం చేసింది. తాము ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీని ఇంకా ఆమోదించని వినియోగారుల ఖాతాలు కూడా ఎప్పటిలాగే పనిచేస్తాయని తెలిపింది. అయితే ఇటీవల వాట్సాప్‌ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో మే 15 నుంచి అమలు చేయాలని వాట్సాప్‌ సూచించిన కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని కేంద్రం ఈ నెల 18న వాట్సాప్‌ ప్రతినిధులకు లేఖ రాసింది. వారంలోగా స్పందించకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. అయితే కొత్త ప్రైవసీ పాలసీకి మే15 వరకు గడువు విధించగా.. అనంతరం దాన్ని వాయిదా వేస్తున్నట్లు వాట్సాప్‌ సంస్థ ఇటీవల ప్రకటించింది.

ఇవీ కూడా చదవండి:

Mobile OTP: మొబైల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. సిమ్‌ మార్చకుండానే కేవలం ఓటీపీ ద్వారానే మారవచ్చు..!

Realme X7 Max: రియల్‌మీ నుంచి రానున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. అద్భుతమైన ఫీచర్స్‌.. పూర్తి వివరాలు ఇవే..