డేటా సైన్స్, కమ్యూనికేషన్‌ టెక్నాలజీల‌కు పెరుగుతున్న ప్రాధాన్యం

| Edited By:

Mar 16, 2019 | 9:49 PM

ఆధునిక ప్రపంచంలో ఇంజనీరింగ్‌ విద్యార్థులు నూతన టెక్నాలజీపై దృష్టి సారించాలని పలువురు ఐఐటీ ప్రొఫెసర్లు, వర్సిటీల వీసీలు సూచించారు. ప్రస్తుత తరుణంలో డేటా సైన్స్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీల ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. హైదరాబాద్‌లోని స్టాన్లీ ఉమెన్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో శుక్రవారం డేటా సైన్స్‌పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పోలండ్‌లోని జాన్‌ వైజికోస్కి యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పోల్కోవస్కీ హాజరయ్యారు. పోల్కోవస్కీ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థులు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవడం కాకుండా నూతన టెక్నాలజీని కనిపెట్టేందుకు […]

డేటా సైన్స్, కమ్యూనికేషన్‌ టెక్నాలజీల‌కు పెరుగుతున్న ప్రాధాన్యం
Follow us on

ఆధునిక ప్రపంచంలో ఇంజనీరింగ్‌ విద్యార్థులు నూతన టెక్నాలజీపై దృష్టి సారించాలని పలువురు ఐఐటీ ప్రొఫెసర్లు, వర్సిటీల వీసీలు సూచించారు. ప్రస్తుత తరుణంలో డేటా సైన్స్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీల ప్రాధాన్యం పెరుగుతోందన్నారు.

హైదరాబాద్‌లోని స్టాన్లీ ఉమెన్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో శుక్రవారం డేటా సైన్స్‌పై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పోలండ్‌లోని జాన్‌ వైజికోస్కి యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పోల్కోవస్కీ హాజరయ్యారు. పోల్కోవస్కీ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థులు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవడం కాకుండా నూతన టెక్నాలజీని కనిపెట్టేందుకు ప్రయత్నించాలని సూచించారు.

ఐఐటీ గువహటి ప్రొఫెసర్‌ ఎస్‌వీ రావు, ట్రిపుల్‌ ఐటీ కర్నూల్‌ డైరెక్టర్‌ సోమయాజులు మాట్లాడుతూ డేటా సైన్స్‌లో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జేఎన్‌టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఓయూ వీసీ రామచంద్రం మాట్లాడుతూ సమాచార, సాంకేతిక రంగాల్లో డేటా సైన్స్‌ అనేక సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు.