Raksha Bandhan 2023: మీ చెల్లి గ్యాడ్జెట్ లవర్ అయితే.. రాఖీ పండుగ రోజు ఈ గిఫ్ట్‌లు వారిని ఆనందపరుస్తాయి.. ఓ లుక్కేయండి..
సోదరులకు రాఖీలు కట్టి, వారి నుంచి భరోసా కోరే సోదరీలకు కోరిన గిఫ్ట్ ఇవ్వడం లేదా వారికిష్టమైన బహుమతులు అందించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో మీ తోబుట్టువు ఒకవేళ టెక్ గ్యాడ్జెట్లను ఎక్కువగా ఇష్టపడేవారైతే మీకు కొన్ని బెస్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులను ఇప్పుడు పరిచయం చేస్తాం. వారికి ఈ రాఖీ పండుగ రోజు అవి బహుమతిగా ఇవ్వడం ద్వారా వారి ఆనందాన్ని రెట్టింపు చేయొచ్చు. పైగా వాటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.

ప్రేమ, అనురాగం.. బంధం, బాధ్యత.. రక్షణ, సంరక్షణకు ప్రతీకగా రక్షా బంధన్ పర్వదినాన్ని అందరూ జరుపుకుంటారు. తోబుట్టువుల మధ్య బాండింగ్ ను చాటి చెప్పే పండుగ ఇది. సోదరులకు రాఖీలు కట్టి, వారి నుంచి భరోసా కోరే సోదరీలకు కోరిన గిఫ్ట్ ఇవ్వడం లేదా వారికిష్టమైన బహుమతులు అందించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో మీ తోబుట్టువు ఒకవేళ టెక్ గ్యాడ్జెట్లను ఎక్కువగా ఇష్టపడేవారైతే మీకు కొన్ని బెస్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులను ఇప్పుడు పరిచయం చేస్తాం. వారికి ఈ రాఖీ పండుగ రోజు అవి బహుమతిగా ఇవ్వడం ద్వారా వారి ఆనందాన్ని రెట్టింపు చేయొచ్చు. పైగా వాటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే జాబితాను చూసేయండి.
కిండిల్(2022 ఎడిషన్).. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ-బుక్ లలో ఇప్పటికే పాఠకులకు బెస్ట్ ఎంపికగా ఈ కిండిల్ నిలుస్తోంది. లేటెస్ట్ 2022 ఎడిషన్ కిండిల్ ఈ-బుక్ సిగ్నేచర్ ఎలక్ట్రానిక్ ఇంక్ గ్లేర్ ఫ్రీ డిస్ ప్లే తో వస్తుంది. దీంతో సాధారణ పుస్తకాన్ని చుదువుతున్న ఫీలింగ్ వినియోగదారులకు వస్తుంది. దీనిలో మీరు ఫాంట్ సైజ్ ను కూడా మార్చుకోవచ్చు. కొత్త కిండిల్ లో 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై ఆరు వారాలు పనిచేస్తుంది. దీని ధర రూ. 9,999గా ఉంది.
లెనోవో ట్యాబ్ ఎం9.. మీ తోబుట్టువు మంచి గేమ్ లవరా.. మల్టీమీడియాను ఎప్పుడూ ఇష్టడతారా? అయితే పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్లో ఈ ట్యాబ్ అందుబాటులో ఉంది. దీనిలో 9 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ హీలియో జీ80 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. బ్యాటరీ 5,100ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. వెనుకవైపు 8ఎంపీ కెమెరా, 2ఎంపీ ఆటోఫోకస్ సెల్పీ కెమెరా ఉంటాయి. దీని ధర కూడా రూ. 9,999గా ఉంది.




అమేజ్ ఫిట్ జీటీఎస్3 స్మార్ట్ వాచ్.. మీ తొబుట్టువు ఫిట్ నెస్ పై ఎక్కువ దృష్టి పెట్టే వారైతే వారికి ఇది గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. జీపీఎస్ ట్రాకింగ్, 150 కన్నా ఎక్కు స్పోర్ట్స్ మోడ్లు ఉన్నాయి. హార్ట్ రేట్ మోనిటర్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటర్, స్లీప్ సైకిల్, స్ట్రెస్ మోనిటరింగ్, ఫీమెయిల్ హెల్త్ సైకిల్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర రూ. 9,999గా ఉంది.
ప్రోకస్ వన్ ఎక్స్ వీఆర్ హెడ్ సెట్.. వర్చువల్ రియాలిటీ(వీఆర్), మెటావెర్స్ సాంకేతికతో కూడిన వస్తువులు ఇకపై ఎంటర్టైన్ మెంట్ సెక్టార్ లో రూల్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ లోపే మీరు వీఆర్ సాంకేతికతతో కూడిన హెడ్ సెట్లను అనువైన బడ్జెట్లోనే కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ ఆప్టికల్ వీఆర్ గ్లాసెస్ ను స్మార్ట్ ఫోన్ ముందు కూడా పెట్టుకోవచ్చు. వీఆర్ వీడియోలు, గేమ్స్, యాప్లను ఆస్వాదించవచ్చు. దీని ధ రూ. 2,699గా ఉంది.
ఈకో డాట్(ఫిప్త్ జనరేషన్).. అమెజాన్ కు చెందిన ఈ స్పీకర్ కేవలం స్పీకర్ మాత్రమే కాదు. వైఫై కి కనెక్ట్ అవుతుంది. ఏసీ, ఫ్యాన్, టీవీ వంటి వాటిని దీని ద్వారా వాయిస్ కమాండ్స్ ఇచ్చిఆపరేట్ చేయొచ్చు. అలెక్సా అసిస్టెన్స్ ఉంటుంది. ఇది హిందీని కూడా అర్థం చేసుకుంటుంది. దీని ధర రూ. 5,499గా ఉంది.
ఇవే గాక సోనీ డబ్ల్యూఎఫ్-సీ700ఎన్ ఇయర్ బడ్స్, సెవెనీర్ మ్యాగ్ చార్జ్ డీ1800 3 ఇన్ 1 చార్జర్ డాక్, సిన్లింక్ స్టార్ ప్రొజెక్టర్ నైట్ లైట్, అమెజాన్ బేసిక్స్ యూఎస్బీ-సీ 7 ఇన్ 1 హబ్, వెస్టర్న్ డిజిటల్ ఎలిమెంట్స్ 1.5 టీబీ హెచ్ డీడీ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను మీ తోబుట్టువులకు బహుమతిగా ఇచ్చేందుకు పరిశీలించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..